డబ్బులు నిలువ ఉండాలంటే?

1
28037

way-to-preserve money

సిరిసంపదల దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోడానికి స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ దోహదపడుతుంది. ధనాదాయ మార్గాలను పెంచుకునేందుకు స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను ప్రతిష్టించుకుంటారు.

స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ప్రత్యేకత ఏమిటంటే, అందులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి మాత్రమే కాదు, స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ లో సకల దేవతలూ నివసిస్తారు.మామూలుగా స్ఫటికాన్ని మహాశివునికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇక స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ లో మహాశివుని శక్తి అమితంగా ఉంటుంది.మహాన్యాసము నందు శివుడుని స్పటిక స్వరూపుడను ప్రస్తావన కలదు. “శుద్ధ స్పటిక సంకాశం నిర్మలం పాపనాశనం” మహేశ్వరుడు శుద్ధ స్పటిక సంకాశుడు, నిర్మలమైనవాడు, పాపహరుడైన శివుడిని స్పటిక రూపంలో భక్తితో కొలిచిన సకల పాపములు హరించును.

పిరమిడ్ లో సహజంగా కొన్ని శక్తులు ఉంటాయి. వాటికి లక్ష్మీదేవి, మహాశివుడు తదితర దేవతల దివ్య శక్తులు తోడవుతాయి. దాంతో స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ఉన్న ఇళ్ళు ఐశ్వర్య నిలయాలుగా ఉంటాయి.

ధనం, ధాన్యం, బంగారం విస్తారంగా సమకూరాలంటే స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను ఇంట్లో ఉంచుకోవాలి.ధైర్యం, స్థైర్యం, శౌర్యం మన సొంతం కావాలంటే స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను సమకూర్చుకోవాలి.సంతానలేమి లేకుండా, చేపట్టిన ప్రతి పనిలో దిగ్విజయం కలగాలంటే స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను నమ్ముకోవాలి.

ఇంట్లో తూర్పు దిశలో స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ స్థాపించాలి. ఉదయాన్నే లేచి స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను దర్శించుకోవాలి.

స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ స్థాపించిన ఇల్లు ధన, ధాన్య, కనక, వస్తు, వాహనాదులతో కళకళలాడుతుంది.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here