దసరా పండుగ నిర్ణయంఎలా చేస్తారు ?
ప్రతి సంవత్సరము శరదృతువు లో అశ్వియుజ శుద్ద పాడ్యమి నుండి దశమి వరకు గల సమయమును దసరా లేదా దేవి నవరాత్రులుగా పండితులు నిర్ణయించడము జరుగుతుంది .శరదృతువులో వస్తుంది కాబట్టి దేవి శరన్నవరాత్రులు అని కూడా సంబోదించడము జరుగుతుంది .
అంతే కాకుండా శరన్నవరాత్రులను ఆయా సమయాలలో వచ్చే తిధులయోక్క వృద్ది క్షయాలను అనుసరించి సాదారణంగా 9 రోజులు గాను ,కొన్ని సమయాలలో 10 రోజులుగాను ,మరి కొన్ని సమయాలలో 11 రోజులుగాను పండితులు నిర్ణయించడము జరుగుతుంది .అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరము తిధుల యోక్క వృద్ది క్షయముల వలన దేవి నవరాత్రులను 11 రోజులుగా నిర్ణయించడము జరిగింది .
పండుగ జరుపుకునే విధానం ఏమిటి ?
ఈ శరన్నవరాత్రులలో సాదారణం గా అమ్మవారిని ఒక్కో తిధి రోజు ఒక్కో రూపముతో అలంకరించి పూజించడం జరుగుతుంది. అలాగే అమ్మవారు ఒక్కో రూపములో ఉన్న సమయములో ఒక్కో రకమైన నైవేధ్యమును సమర్పించే సాంప్రదాయము కూడా ఉంది.
ఆయా తిధులలో అమ్మవారి ఆయా రూపాలు,సమర్పించవలసిన నైవేధ్యములు వరుసగా………
17/10/2020
- శనివారము, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
- శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (శైలపుత్రి)
- ఎరుపుచీర
- నివేదన: ఆవునేయి, కట్టె పొంగలి(పులగం)
18/10/2020
- ఆదివారము,ఆశ్వయుజ శుద్ధ విదియ,
- శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి (బ్రహ్మ చారిణి )
- పసుపుచీర
- నివేదన: పంచదార, దధ్యన్నము
19/10/2020
- సోమవారము, మంగళవారము, ఆశ్వయుజ శుద్ధ తదియ
- శ్రీ గాయత్రి దేవి ( చంద్ర ఘంట )
- గులాబిచీర
- నైవేద్యం: పాలతో నైవేద్యం, గుడాన్నం
- (చెక్కెర పొంగలిలో పంచదారకు బదులుగా బెల్లం)
20/10/2020
- మంగళవారము, ఆశ్వయుజ శుద్ధ చవితి
- శ్రీ అన్నపూర్ణా దేవి (కూ ష్మాం డ)
- గోధుమ రంగు చీర
- నైవేద్యం: అప్పాలు, నేతి అన్నం
21/10/2020
- బుధవారము, ఆశ్వయుజ శుద్ధ పంచమి, (మూలానక్షత్రం)
- శ్రీ సరస్వతీ దేవి( కాళరాత్రి )
- తెలుపురంగు చీర
- నివేదన: జీడిపప్పు కొబ్బరికాయ
22/10/2022
- గురువారము, ఆశ్వయుజ శుద్ధ షష్టి
- స్కంద మాత (లలితా దేవి)
- ఆకుపశ్చ చీర
- నైవేద్యం: అరటి పళ్లు, పాయసాన్నం
23/10/2020
- శుక్రవారము, ఆశ్వీయుజ శుద్ద సప్తమి
- శ్రీ మహాలక్ష్మిదేవి
- చిలుకపచ్చ చీర
- నైవేద్యం: బెల్లం, పాయసం
24/10/2020
- శనివారము, ఆశ్వయుజ శుద్ధ అష్టమి( దుర్గాష్టమి/మహర్నవమి)
- శ్రీ దుర్గా దేవి /శ్రీ మహిషాసురమర్ధినీ దేవి ( సిద్దిదాత్రి )
- ఎరుపు చీర / బూడిదరంగు చీర
- నైవేద్యం: పేలాలు పాయసం/ నువ్వులు, గుడాన్నం నైవేద్యం
25/10/2020
- ఆదివారము, ఆశ్వయుజ శుద్ధ నవమి (విజయదశమి)
- శ్రీ రాజరాజేశ్వరి దేవి
- అనేక వర్ణాలు కలిగినచీర
యథాశక్తి అన్నిరకముల నైవేద్యాలు పండ్లు నివేదన చేయవచ్చును
ఈ విధముగా అమ్మవారిని ఆయా తిధి, నక్షత్రాలను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో రూపములో అలంకరించి పూజించడము జరుగుతుంది. అయితే మొదటి రోజు మాత్రము ఏ దేవాలములో ఏ అమ్మ వారు అయితే ఉంటారో ఆ అమ్మవారిని అదే రూపములో అలంకరించి పూజించడము జరుగుతుంది. ఉదాహరణకు దుర్గా అమ్మవారి గుడిలో అమ్మవారిని మొదటి రోజు దుర్గా అలంకారముతోనే పూజిస్తారు, అలాగే గాయత్రి దేవి దేవాలయములో అమ్మవారిని మొదటి రోజు గాయత్రి రూపములోనే అలంకరించి పూజించడము జరుగుతుంది.
అదే విధముగా గృహములలో అయితే ఎవరి కుల/వంశ/అనుస్టాన దేవతను వారు మొదటి రోజు అదే రూపములో అలంకరించి, భావన చేసి పూజించడము జరుగుతుంది.
అయితే ఆయా అమ్మవారి రూపములను ఆ విధముగానే ఎందుకు అలంకరిస్తారు. నైవేధ్యముగా వాటినే ఎందుకు సమర్పిస్తారు, మన దైనందిన జీవితములో మనం నిత్యం ఎదుర్కొనే సమస్యల విముక్తికి అమ్మవారిని ఏ విధముగా పూజించాలి ..,అనేది మరో పోస్టు లో తెలుసుకుందాము.
దసరా సమయంలో అమ్మవారిని అన్ని రూపాలలో కొలవడానికి గల కారణం? | Dasara Devi Different Avatar in Telugu