దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపం….
శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి
దక్షిణావృత శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి.
సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ శోభను పెంచుతుంది.
దక్షిణావృత శంఖం పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలోదక్షిణావృత శంఖం ఒకటి .విష్ణు పురాణం ప్రకారం దక్షిణావృత శంఖం లక్ష్మి సముద్రతనయ అయివున్నది.
దక్షిణావృత శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. దీపావళి రోజున దక్షిణావృత శంఖాన్నిపూజ, ఆరాధన, అనుష్ఠాలలో, హారతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో ఉపయోగిస్తారు.
దక్షిణావృతశంఖాన్ని తూర్పు ముఖంగా ఉండి అభిషేకం చేసినప్పుడు కుడి ప్రక్కన అనగా దక్షిణం వైపు కడుపు (ఆవృతం) ఉంటంది కాబట్టి ఈ శంఖానికి దక్షిణావృతశంఖం అంటారు.
దక్షిణావృత శంఖాలలో తెలుపు రంగులో ఉన్నవి శ్రేష్టం.ఎరుపు రంగు గీతలతో ఉన్న శంఖాలను కూడ పూజిస్తారు.
దక్షిణావృత శంఖాన్ని దీపావళి,అక్షయ తృతియ మరియు శుక్రవారం రోజు పూజిస్తే ఉత్తమ ఫలితాలు సాదించవచ్చు.
దక్షిణావృత శంఖాన్ని పూజామందిరంలో ఎర్రని వస్త్రంపైనగాని, బియ్యం పైనగాని, కుంకుమ పైన గాని, కూర్మ స్టాండ్ పైనగాని ఉంచి లలిత సహస్రనామాలుగాని, లక్ష్మీ అష్టోత్తరం గాని చదువుతు పూజచేయాలి.
ఇంకా శంఖంతో విగ్రహాలను అభిషేకించవచ్చును.
” సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్ “అనే మంత్రం గాని “ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయనమః” అను మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
వ్యాపారస్తులు ఇలా ఎందుకు చేస్తారు ? | Why do Business People do it in Telugu
Businesses developed