కంటి సమస్యల నివారణకు మార్గాలు ? | Ways to Prevent Eye Problems in Telugu

0
2883
download
కంటి సమస్యల నివారణకు మార్గాలు ? | Ways to Prevent Eye Problems in Telugu

1 గుంట గలగర తో గుంటగలగర మొక్కలు తెచ్చి కడిగి, ఆరబెట్టి, దంచి పొడి చేసి వస్త్ర దూళితం పట్టి నిలువ చేసుకోండి ఈ చూర్ణాన్ని ఒక చెంచా మోతాదు గా పాత నల్ల బెల్లం తో కలిపి గాని లేక కండ చక్కెర తో కలిపిగాని తిని ఒక కప్పు పాలు త్రాగాలి ఇలా చేస్తే క్రమంగా రక్త శుద్ధి జరిగి శిరస్సు లోని కంటి నాడులు శక్తీ వంత మై దృష్టి పెరుగుతుంది

2 ఉసిరిక బెరడు మెత్తగా దంచి పొడి చేసి దాంతో సమానం గా కండ చక్కెర పొడి ని ఒక చెంచా అర చేతిలో వేసుకొని కొద్ది కొద్దిగా నోట్లో వేసుకొని చప్పరించాలి ఇది క్రమ క్రమంగా శరీరంలో ని అన్ని భాగాలను శక్తీ వంతం చేస్తుంది కేవలం కంటి దృష్టి పెరగడమే కాక గుండె కు, కాలేయానికి వెంట్రుకలకు ఇలా అన్నీ భాగాలకు సహజ శక్తిని ప్రసాదిస్తుంది

3 బాదం పాలతో బాదం పప్పు 100 గ్రాములు సోంపు గింజలు 100 గ్రాములు కండ చక్కెర 100 గ్రాములు తీసుకోవాలి బాదం పప్పును ఒక రాత్రి వేడి నీటిలో నానబెట్టి ఉదయం నీరు తీసివేసి పప్పు లపై వున్న తోలును తీసివేసి లోపల పప్పును నల గొట్టి ఎండపెట్టి పొడి చేసుకోవాలి. అలాగే సొంపు గింజలను కొంచం నేతితో దోరగా వేయుంచి దంచి పొడి చేసుకోవాలి. కండ చక్కెర కూడా మెత్తగా పొడి చేసుకోవాలి ఈ మూడింటిని కలిపితే అద్భుతమైన ఔషధం తయారవుతుంది రోజు రాత్రి నిద్రించే ముందు ఒకటి నుండి రెండు చెంచాల మోతాదుగా అర గ్లాసు వేడి పాలల్లో కలిపి త్రాగాలి ఇలా ఆరు నెలలు త్రాగితే కళ్ల కు అద్దాలు పెట్టవలసిన అవసరం లేకుండా పోతుంది. అంతే గాక అపార మైన తెలివి తేటలు, జ్ఞాపక శక్తీ పెరుగుతాయి. సర్వాంగాలు శక్తివంతమవుతాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here