
అఖండదీపం వెలిగించాలి అనే నియమం మాత్రం లేదు. వెలిగించడం తప్పేమీ కాదు. అదొక సంప్రదాయం ఉన్నది. అఖండ దీపం కూడా తొమ్మిదిరోజుల పాటు కలశంతో లేదా ప్రతిష్టింపబడినటువంటి మండపంతో పాటు ఉండాలి అని ఒక నియమం ఉన్నది. అఖండ దీపం పెట్టినప్పుడు అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తొమ్మిదిరోజులు అది ఏమాత్రం ఘనమెక్కకుండా చూసుకోవాలి. దీపం ఆరకుండా అనరాదు. ఘనమెక్కకుండా అనాలి. అందుకు దీపం పూర్తి కాకుండా జాగ్రత్త పడాలి తొమ్మిదిరోజులు కూడా.
అటువంటి నమ్మకము, పరిసితి ఉన్నప్పుడు అఖండదీపం పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా దీప ప్రజ్వలనకి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే దేవతా శక్తులను ఆవహింపజేయుట అనేది. ఎందుకంటే దేవతలు ప్రకాశశరీరులు. కాంతిశరీరులు. కాంతిశరీరులైన దేవతలు అక్కడికి రావాలి ఆంటే కాంతి స్వరూపమైన దీపం ఉండాలి. అందుకే దేవతారాధనకి పూర్వమూ, మధ్యలో దీపం వెలిగిస్తారు. చివరికి నీరాజనం రూపంలో కూడా జ్యోతినిస్తారు. జ్యోతిశరీరులైన ఆ దేవతాశక్తులు అక్కడికి వచ్చి యజ్ఞం నిర్విఘ్నంగా జరగాలి అనే ఉద్దేశ్యంతో ముందు అఖండ దీపాన్ని వెలిగించడం కనపడుతున్నది. అదేవిధంగా మన సంకల్పం అఖండంగా వృద్ధి చెందాలి అది సిద్దిపొందాలి అనే ఉద్దేశ్యం కూడా అఖండదీపాన్ని వెలిగించడం కనపడుతున్నది. మరొక ఉద్దేశ్యం అఖండ దీపం వెలిగించడం వల్ల అన్నిరకాల దోషాలూ పోతాయి. ముఖ్యంగా ఆయుర్వృద్ధి, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది.
ఈకారణం చేత అఖండ దీపాన్ని పెట్టడం ఆ జ్యోతి రూపంలో ‘లోకైక దీపాంకురాం’ అయినటువంటి అమ్మవారిని ఆరూపంలో ప్రతిష్టించి ఆరాధిస్తున్నాం. కలశము, విగ్రహము పటము అని వాటితో పాటు మనం ఇక్కడ తీసుకుంటున్నది జ్యోతి. ఆ దీపజ్యోతి యందు అమ్మవారు ఆ తొమ్మిది రోజులూ కదలకుండా ఉండి మన చేత ఆరాధన పొందుతున్నారు. ఆ లోకైక దీపాంకురాం అయినటువంటి జ్యోతిస్స్వరూపానికి సంకేతంగానే అఖండ దీపారాధన చెప్పబడుతూ ఉన్నది.
నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి?
శరన్నవరాత్రి పూజను ఉదయం చేయాలా? లేక రాత్రి వేళ చేయాలా? | Dasara Pooja Vidhanam in Telugu