మౌనవ్రతం -ఆచరించడం వల్ల కలిగే లాభాలు ? | Mouna Vratham Benefits in Telugu ?

0
2262
మౌనవ్రతం -ఆచరించడం వల్ల కలిగే లాభాలు ? | Mouna Vratham Benefits in Telugu ?
Mouna Vratham Benefits in Telugu ?

Mouna Vratham Benefits in Telugu ?

మౌనవ్రతం లో మౌనం ఎవరికి కోసం??
మనలో ఉన్న ఏ వ్యవస్త కోసం??

నోరు మూసుకుంటే మౌనవ్రతం చేసినట్లేనా??

సమాధానం కంటే ముందు మౌనం ని భంగపరచే విషయవస్తువుల గురించి తెలుసుకుంటే నే సమాధానం సరిగ్గా అర్ధమౌతుంది.

కళ్ళు — కంటిద్వారా దృశ్యము మనసు లో ప్రవేశిస్తుంది.
మనసు ప్రేమ,వ్యామోహము ,ఈర్ష్య,లోభం,కోపము,మదము,ఆశ్చర్యం,దుఃఖం లాంటి భావనలని ప్రేరింప చేసుకోని మౌనభంగంకి గురిఅవుతుంది.

చెవులు– చెవుల ద్వారా శబ్ధం మనసు లో ప్రవేశించి అవమానం,అనుమానం,అంచన,దుఃఖం,కోపం,కరుణ,దయ లాంటి భావనల ని మనసు లో ప్రేరేపించి మౌనభంగం కి కారణం అవుతాయి.

చర్మం– స్పర్శ ద్వారా మనసు కామ,ప్రేమ,చీదర,తన్మయత్వం లాంటి భావనల కి గురై మౌనభంగం కాబడుతుంది.

ముక్కు–వాసన ముక్కు ద్వారా మనసు లో ప్రవేశించి రుచి,అరుచి,చీదర లాంటి భావనలని ప్రేరేపించి మౌనభంగం కావిస్తుంది.

నోరు– భోజనం ద్వారా శక్తి ని ఇస్తుంది.ఆ శక్తి ని మనసు కామ,క్రోధ,మద,మాన,మోహ ,లోభ,క్షోభ,రాగ,ద్వేష,ద్రోహ భావనల ద్వారా క్రియాత్మకతని ప్రేరేపించి మౌనం విచ్చినం అయ్యేలా తోడ్పడుతుంది.

ఈ పంచేద్రియాల ఏకకాల ఐక్యత తో జరుగుపరిణామం వలన మైనం కాకావికలం అవుతుంది!!!

మరి మౌనం మనకెందుకు???

మౌనం అంటే స్తిరత్వం.

కోట్లాది రూపాయలు సంపాదించినా స్తిరత్వం మనసు పొందలేదు.
స్తిరత్వం లేని మనసు ఉన్నదాన్ని విడచి లేని దానికై పరుగులు పెడుతుంది.
మీ కోట్లాది రూపాయల ని మీ మనసే గుర్తించదు స్తిరత్వం లేకపోతే!!!

ఆత్మభావాలైన కరుణ,ప్రేమ(శరీరాల మధ్య ఆకర్షణ ప్రేమ కాదు ),ఓర్పు ,ప్రతిక్ష,కృతఙ్ఞత
లాంటివి మనసు కి స్తిరత్వం ఇస్తాయి.

విషయానికొద్దాం.

మాట్లాడకుండా Tv చూస్తూ నవ్వుకుంటూ (శబ్దం రాకుండా) సమయం గడిపేయడం అది కూడా పూజ చేసి అడ్డనామాలు ,నిలువునామాలు పెట్టుకొని చెంపలకి శ్రీగంధం పూసుకొని!!!!

ఇది ఢాంభికం,ఇది ధార్మిక ఆడంబరం.
ఇది ఆత్మవంచన.
లేని పవిత్రతని ఉన్నట్లుగా నటించడం.
అంతస్సు దుర్గధం తో పాచిపోతుంటే ఆవరణ(శరీరం)కి అత్తరు పూసుకుంటున్నట్లు!!

మౌనవ్రతం లో మనసు స్తిరరత్వం పొందాలి.
పంచేంద్రియాలు పటిష్ఠంగా ఉండి ఆత్మభావనలని మాత్రమే స్వీకరించే మానసిక వ్యవస్థ ప్రాదుర్భావానికే మౌనవ్రతం.
నోరు మాత్రమే కాకుండా పంచేంద్రియాలని స్తగితం చేసి మనసు ని భావాలకి దూరంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం!!
పంచేద్రియాల నుండి మనసు సంగ్రహించేది పరభావం(పరాయి భావం)
పరభావం వలన ప్రభావం కి లోనౌతుంది మనసు!!ప్రభావం పరులవైపు పరిగెత్తిస్తుంది.

పంచేద్రియాల స్తభింప చేయడం వలన పరభావం సమాప్తమౌతుంది!!
మనసు కి అంతఃభావనలు అందడం ప్రారంభం అవుతాయి.
అంతఃభావనలు అంటే స్వభావనలు!!

స్వభావనలు మనసుని స్వయం లో కి ప్రవేశింప చేస్తాయి.
స్వయం లో ప్రవేశించిన మనసు ఆత్మానుసంధానం కావించబడుతుంది
అప్పుడు మనసు ఆత్మగుణమైన స్తిరత్వాన్ని పొందుతుంది.

అప్పుడు మనసు క్రియలు స్వభావికం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here