Bhishma Ekadasi in Telugu
మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మఏకాదశి అని అంటారు. పరమ భాగవోత్ముడు అయిన భీష్ముడు ఉత్తరాయణ పుణ్య కాలమైన భాగవతంలో శుద్ద అష్టమినాడు అంపశయపై నుండి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమై తరించాడు.
భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో, ధర్మరాజు కి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి.
భీష్మఏకాదశి రోజున భీష్ములకు తర్పణం చేసి, శ్రీమహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని అంటారు. ఒక్క భీష్మఏకాదశి రోజున మాత్రమె కాదు, ఏ మాసంలో వచ్చిన ఏకాదశకి అయినా ఆచరించాల్సిన విధివిధానాలు ఒక్కటే. భీష్మఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యాన్ని తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇంద్రుడు ఈరోజు రాక్షసుల పై యుద్దానికి వెళ్లి, పరమాత్మ కృపతో విజయాన్ని పొందాడు. ఇలా మహానుభావులు ఎందరో ఈరోజు తమ పనులు మొదలుపెట్టి విజయాన్ని సాధించారు కాబట్టి దీన్ని జయఏకాదశి అని కూడా అంటారు.
మనం కూడా ఈరోజు భీష్ముడిని ఆరాధించి, వ్రతాన్ని ఆచరించి పరమాత్మ కృప పొందితే మనం ప్రారంభించే పని విజయవంతం అవుతుంది.ఏకాదశి వ్రతం ఆచరించేవారు, దశమిరోజు ఒక్క పూట మాత్రమె భోజనం చెయ్యాలి. సాయంత్రం భోజనం చెయ్యకుండా అల్పాహారం సేవించాలి. ఈరోజు తెల్లవారు జామునే నిద్ర లేచి విష్ణుమూర్తిని ఆరాధించి, ఆరోజంతా ఉపవాసం ఉండాలి.