శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో అర్జునునికి ఎన్నో విషయాలను బోధించాడు. భగవద్గీత అర్జునికి మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ అపురూపమైన జ్ఞానభాండాగారం వంటిది. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అంటారు, నిజానికి ఆయన ధర్మ పక్షపాతి. పాండవులు ధర్మానికి కట్టుబడ్డారు కనుక శ్రీకృష్ణుడు వారిని ఆదరించాడు. పాండవులకు ప్రతి కష్టం లోనూ కృష్ణపరమాత్ముడు వెన్నంటే ఉన్నాడు. వారికి ఎన్నో విషయాలను సమయానుకూలంగా బోధించాడు. అటువంటి వాటిలో కొన్ని..
2. ఒక చిన్న గంధపు చెక్క మీ ఇంట్లోని చెడు ప్రభావాలన్నిటినీ దూరం చేయగలదు
గంధపు చెక్క ఇంట్లో ఉండటం వలన ఆ ఇల్లు సుఖసంతోషాలతో, ప్రశాంతతతో ఉంటుందని శ్రీ కృష్ణుడు చెప్పాడు. నర దృష్టిని, చెడు ప్రభావాలను గంధం పారద్రోలుతుంది. చందనం భగవంతునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో ఒకటి. గంధాన్ని నుదుటన ధరించడం ద్వారా ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.నుదుటన ఉన్న గంధం మెదడును అనేక ఒత్తిడులనుంచీ దూరం చేసి ప్రశాంతతను, ఆహ్లాదకరమైన భావనలనూ, శాంతినీ కలుగజేస్తుంది.ధ్యానానికి చందన పరిమళం ఎంతగానో ఉపకరిస్తుంది. చందనం మనలోని ఆధ్యాత్మిక భావనలను మేల్కొలుపుతుంది.