ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది ? | Siridhanyalu (Millets) Health Benefits in Telugu.

0
12211
Siridhanyalu (Millets) Health Benefits
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది ? | Siridhanyalu (Millets) Health Benefits in Telugu.

Millet Health Benefits

1. కొర్రలు (Foxtail Millet):

నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్, పార్కిన్సన్, మూర్ఛరోగాల నుండి విముక్తి.

2. అరికలు (Kodo Millet):

రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్, | మలబద్ధకం, మంచినిద్ర.

3. ఊదలు (Barnyard Millet):

లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు.

4. సామలు (Little Millet):

అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానలేమి సమస్యల నివారణ.

5. అండు కొర్రలు (Browntop Millet):

జీర్ణాశయం, ఆర్థయిటిస్, బి.పి. థైరాయిడ్, కంటి సమస్యలు,
ఊబకాయ నివారణ.

6. ఏ ఆహార పదార్థ గుణగణాలైనా దానిలో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్ల నిష్పత్తిని బట్టి నిర్ణయింపబడుతుంది. వీటి నిష్పత్తి 10 కంటే తక్కువ ఉండే రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహారం కింద లెక్క ఈ సిరిధాన్యాలలో ఈ నిష్పత్తి 5.5 నుంచి 8.8 వరకు ఉంటుంది. వరి బియ్యంలో ఆ నిష్పత్తి 385 ఉంటుంది. ముడి బియ్యం, గోధుమలలో కూడా ఈ నిష్పత్తి పెద్దగా తేడా లేదు.

సిరిధాన్యాల వాడుటకు ముఖ్య సూచనలు (Important Instructions for Use of Millet’s):

1. ఒక్క అండు కొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి.
మిగతా సీరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.

2. సమయాభావం ఉంటే ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు.

3. ఈ సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు.దేనికి అది విడివిడిగా వండుకోవాలి. కలగలిపితే ఏ రకమైన ప్రయోజనం కలుగదు.

4. ఏ ఆరోగ్య సమస్యలు లేనివారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్నే వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరిధాన్యాన్ని వాడాలి.

5. అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున వాడుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో మొదలు పెట్టాలి.

6. వీటితో పాటు కషాయాలు కూడా తీసుకుంటే ఇంకా మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి సమస్యనుబట్టి ఈ సిరిధాన్యాలలో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చును. ఉదాహరణకు, ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పైన వివరించిన పట్టికలో సూచించిన విధంగా వారికి అవసరమైన సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకుని తిరిగి ముందు ఎంపిక చేసుకున్న ధాన్యాలను మరల మూడు రోజుల చొప్పున వాడుకోవాలి.

7. ఉదాహరణకు, సుగర్, కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటే వారు అరికలు 3 రోజులు, ఊదలు 3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి. ఆ సమస్యతో పాటు ప్రాస్యేటు సమస్య కూడా ఉంటే సామలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్కరోజు తినాలి.

8. వరి బియ్యం, గోధుమ, మైదా, పాలు, పంచదార, కాఫీ, టీ, అయొడైజ్డ్ సాల్ట్, మాంసాహారం, రిఫైన్ ఆయిల్స్ తప్పనిసరిగా మానివేసి, దీనిని ఒక జీవన విధానంగా చేసుకోవాలి.

9. పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చును. సముద్రపు ఉప్పు గానుగ నూనె వాడుకోవాలి..

10. వీటితో పాటు కొన్ని రకాల ఆకు కషాయాలు తీసుకుంటే ఇంకా మంచిది.

11. మహిళల సమస్యలకు గోంగూర ఆకుల కషాయం బాగా పనిచేస్తుంది.

12. రోగ నిరోధకశక్తి పెంపొందించకోవడానికి గరికే కషాయం పనిచేస్తుంది. కొత్తిమీర, పుదీనా, నిమ్మగడ్డి ఆకుల కషాయాలు ఎవరైనా వాడవచ్చును.

13. ఏ కషాయమైనా ఒకవారం మాత్రమే వాడాలి. ఒకదాని తరువాత ఒకటి వాడుకోవాలి. సుగర్ ఉన్న వారికి దొండ ఆకుల కషాయం, దాల్చిన చెక్క కషాయం మంచివి. ఇవి పరగడుపున తీసుకోవాలి.

కషాయం తయారు చేసే విధానం (How to Make a Potion):

1. రాగి పాత్రలో ఉంచిన 150-200 మి.లి. నీరు తీసుకుని, (రాగి పాత్రలలో వేడివంట చెయ్యకూడదు) వేరే గిన్నెలో నీరు మరిగించి, దానిలో మనకు అవసరమైన 5-6 ఆకులు వేసి నాలుగు నిమిషాలపాటు ఉంచి, స్టవ్ కట్టేసిన తరువాత 2 నిమిషాలు మూతపెట్టి, ఆ తరువాత వడగట్టి, ఆ నీటిని త్రాగాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చెయ్యాలి. ఉదయం పరగడుపున ఒకసారి, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక గంట ముందు తీసుకోవాలి.

2.  రక్తహీనతకు 3 రోజులు అరికెలు. 3 రోజులు సామలు రోజుకి 3 పూటలు తినాలి. తరువాత 3 రోజులు ఒక్కొక్క సిరిధాన్యాం 3 పూటలు తినాలి.

3.  దీనితోపాటు పరగడుపున క్యారెట్, ఉసిరి, జామ లేదా బీట్రూట్, రసం తీసుకోవాలి, సాయంత్రం 20 కరివేప ఆకులు, 1 గ్లాసు పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి, 15-20 నిమిషాల తరువాత, భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారింపబడుతుంది.

4.  ఈ సిరిధాన్యాలతో అన్ని రకాల వంటకాలు వండుకోవచ్చును. మనం వరి బియ్యం, గోధుమలతో చేసుకునే అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చును. పైగా అత్యంత రుచికరంగా కూడా ఉంటాయి. ఈ సిరిధాన్యాలకు 5-6 రెట్లు నీళ్లుపోసి, 4-5 గంటలు నానబెట్టి, ఆ తరువాత గంజిలాగ వండుకుని రోజులో ఎప్పుడైనా, ఏ వయసు వారైనా తీసుకోవచ్చు.

5. థైరాయిడ్ సమస్య ఉన్నవారు 3 రోజులు సామ బియ్యం, ఒక రోజు అరికెలు, ఒక రోజు ఊదలు, ఒక రోజు కొర్రలు, ఒకరోజు అండు కొర్రలు వండుకుని మూడుపూటలు అదే తినాలి. తిరిగి 3 రోజులు సామలు, తరువాత నాలుగు రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినాలి. దీనికి తోడు మెంతి ఆకుల కషాయం ఒక వారం, పుదీన ఆకుల కషాయం ఒక వారం, తమలపాకుల కషాయం ఒక వారం రోజుకి 2-3 సార్లు తీసుకోవాలి. గానుగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజూ ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తీసుకుటే 20 వారాలలో అన్నిరకాల మందులు మానివేయవచ్చును.

డా. ఖాదర్ వలీ గారికి కృతజ్ఞతలు

For More Health Tips

గంజితో ఆరోగ్య రహస్యాలు ? | Health Benefits of Porridge (Ganji) in Telugu ?

పాలివ్వాలంటే…ఇవి తినాలి ? | Must Eat Food For Breast Feeding in Telugu?

ఆయుర్వేదంతో ఆరోగ్యం ? | Ayurveda Health Tips in Telugu ?

క్యాన్సర్_ఒక_వ్యాధి_కాదు..ఒక_విటమిన్_లోపం ? బట్టబయలైన రహస్యం ? | Cancer Vitamin Deficiency in Telugu?

గృహ చికిత్సతో పొడిదగ్గు మాయం | Dry Cough Home Remedies in Telugu

మ‌ధుమేహ వ్యాధిని అదుపు చేసే చిట్కాలు…! Tips to Control Diabetes in Telugu

మందులు వాడకుండా బీపీని అదుపులో ఉంచుకోవడం ఎలా…? How to Control BP without Medicine in Telugu

ఎలర్జీలు… ఆయుర్వేదం చికిత్సలు | Ayurvedic tips for Allergy in Telugu

రోజూ నిద్రలేవగానే నీళ్ళు ఎన్నితాగాలి? ఎలాతాగాలి?

మత్తును తొలగించే మార్గాలు

ఏ పాత్రలో వండితే ఎక్కువగా పోషకాలు ఉంటాయో మీకు తెలుసా ? | Do you know which dish vessel contains the most nutrients in telugu

పిక్క మన రెండో గుండె ? The Second Heart of the human Body in Telugu ?

కిడ్నీలో రాళ్లు కరిగేందుకు రోజూ ఇలా చేయాలి? | How to prevent kidney stones in Telugu?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here