కోరిన‌ కోరిక‌లు వెంట‌నే తీరాలంటే ఏం చేయాలి?

0
5069

నవదుర్గా క్రమంలో సిద్ధిదాయిని అవతార విశిష్టత ఏమిటి? ఆమె అనుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రం ఏమిటి?

నవదుర్గలలో చివరిది నవమినాడు మనం ఆరాధించేటటువంటి తల్లి నవమదుర్గ అయినటువంటి సిద్ధిదాయిని. ఈమెకి సిద్ధిధాత్రి, సిద్ధిదా అని కూడా పేర్లున్నాయి. సిద్దినిచ్చే తల్లి గనుక సిద్ధిదాయిని, సిద్ధిధాత్రి, సిద్దిదా. సిద్ధిదాయిని గురించి చెప్తూ శాస్త్రం చెప్తున్న మాట

‘సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైరమరైరపి!
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయని!!

అని వర్ణించారు. అంటే సర్వజీవులూ సిద్దికోసం తాపత్రయ పడతారు. సిద్ది అంటే ఎవడు ఏది కోరుకుంటే వాడికి అది సిద్ది. ఒక కార్యం చేశాము అంటే దాని ఫలాన్ని కోరుకుంటాం. అలాంటి ఫల స్వరూపం ఏదైతే ఉందో అదే సిద్ది అంటే. ఈ సిద్ధులు అనేక రకాలున్నాయి. మామూలు ప్రయత్నాలతో సాధించే సామాన్య సిద్ధులు అయితే, యోగంతోనూ, మంత్రంతోనూ సాధించే సిద్ధులు కూడా ఉన్నాయి. లౌకిక ప్రయోజనాలు, అష్ట సిద్ధులు గురించి కూడా మనకు శాస్త్రం చెప్తున్నది.

ఇక కైవల్య సిద్ది వరకు ఏ సిద్దినైనా ఇవ్వగలిగేటటువంటి ఆ శక్తి. అందుకే వారు వారు ఏ సాధనలు చేశారో ఆ సాధనలు ఫలించాలి. ఫలించాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహ స్వరూపమే సిద్ధిధాత్రి. అలాగ ఈ తొమ్మిది రోజులు ఎవరైతే వివిధమైన ప్రయోజనాలను ఉద్దేశించి నవరాత్రులు ఆరాధన చేస్తారో వారి అభీష్టాలన్నీ నేను సిద్ధింపజేస్తాను అని చెప్పడం కోసం ఆఖరిరోజైనటువంటి నవమినాడు ఆవిడ పేరు సిద్ధిదాయిని అని ” చెప్పబడుతున్నది. అంటే ఇన్నాళ్ళు మనం చేసిన ఆరాధన ఈ తల్లి స్మరణ చేత సంపూర్ణమైన సిద్ధిని పొందుతుంది.

అందుకే ‘సిద్దేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ’ అని నామములు మనకు లలితా సహస్రనామాలలో కనపడుతున్నాయి. అయితే సిద్ధిదాయిని ఒక రూపం ఉంది. అమ్మవారు ఒకపేరు అనగానే ఒకభావం మనకు స్ఫురిస్తుంది. ఆ స్పురించిన భావమే ఒక రూపంగా ఆరాధింపబడుతుంది. భావం మనకు స్ఫురిస్తుంది. రూపం ఋషికి దర్శనమిస్తుంది. మనం ఆ రూపాన్ని ధ్యానించాలి. ఆ రూపం ఎలా ఉంటుంది అంటే ఆవిడ వాహనంపై కూర్చున్నప్పుడు సింహవాహినిట. ఆసనంపై కూర్చున్నప్పుడు పద్మాసని. పద్మాసనంపై కూర్చుని ఉన్నది. నాలుగు చేతులలో శంఖచక్రగదాపద్మములు ధరించి ఉన్నటువంటిది. స్వచ్చమైనటువంటి పసిమి కాంతులతో ప్రకాశిస్తున్నది. ఆమెను నమస్కరిస్తూ యక్షులు, గంధర్వులు, దేవతలు ఇత్యాదులందరూ కూడా ఋషులు పరివేష్టితులై ఆరాధిస్తున్నారు. ఇలా ధ్యానించాలి ఆ తల్లిని. ఈ సిద్ధిదాయిని ఆ శంఖచక్ర గదా పద్మములు చూస్తుంటే ఆ విష్ణు తత్త్వములు స్పురిస్తున్నాయి. అలాంటి వైష్ణవి అయినటువంటి సిద్ధిదాయని ఈ తొమ్మిదవ రోజున ఆరాధింపబడి సిద్దినిస్తుంది.

ధన లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఏమి చెయ్యాలి ? | What to do for Dhanalakshmi Grace in Telugu