
రావి చెట్టు ను త్రిమూర్తి వృక్షం అని పిలుస్తారు
- రావి చెట్టు గుణ ధర్మాలు
రావిచెట్టు లోని ప్రతి భాగం అనగా పాలు. పండ్లు. బెరడు. కొమ్మలు. ఆకులు.. వేళ్ళు ఇవన్నీ అద్భుతమైన ఔషధ శక్తిని కలిగి వున్నాయి.
రావి చెట్టు మూలం వద్ద ఉండే మట్టి తెచ్చి ఆరబెట్టి దంచి జల్లించి వస్త్ర దూళితం పట్టి ఆ పొడి ని స్నాన చూర్ణం గా ఉపయోగించుకుంటే చర్మ సమస్యలు తొలగి పోయి, చర్మం కాంతివంతం గా, బిగువుగా నిగనిగ లాడుతుంది.
- కాలి పగుళ్ల కు రావి పాలు
కొంత మందికి అరికాళ్ళపగులుతుంటాయి అలాంటి వారు రావి పాల ను ఆ పగుళ్ల కు రోజూ పూస్తుండాలి . దీనితో పాటు రావి పండ్ల ను ఎండబెట్టి, దంచి, పొడి చేసి సమానం గా పటిక బెల్లం పొడి కలుపుకొని రెండు పూటల 5 గ్రా మోతాదు గా సేవిస్తుంటే పగుళ్లు అతి త్వరగా తగ్గిపోయి పాదాలు నునుపుగా తయారవుతాయి.
- కంటి వ్యాధులకు రావి పాలు
కళ్ల వెంట నీరు కారడం, కళ్ళు వాపు పుట్టడం వంటి సమస్యల తో బాధపడుతున్న వారు రావి పాల ను సీేసపు కడ్డి కంటించి కాటుక లాగా కళ్ల లో పెడుతుంటే ఆశ్చర్య కరం గా కంటి వాపులు , కళ్లు నీరు కారడం వంటి కంటి సమస్యలన్నీ నివారించ బడుతాయి.
-
సంతానం కలుగుటకు రావి పాలు
సంతానం లేని స్త్రీలు రావి చెట్టు వద్దకు వెళ్ళి మనసులో కోరిక నివేదించుకొని ప్రదక్షిణ చేసి రావి పండ్లను సేకరించాలి .
వాటిని కడిగి ఎండ బెట్టి , దంచి జల్లించి వస్త్ర దూళితం పట్టి దానితో సమానం గా పటిక బెల్లం పొడి కలిపి ఒక గాజు సీసా లో భద్ర పరుచుకోవాలి .
సంతానం కోరుకున్న స్త్రీలు బహిస్టు స్నానం చేసిన నాలుగవ రోజు నుండి వరుస గా పద్నాలుగు రోజుల పాటు రెండూ పూటల ఒక చెంచా మోతాదు గా సేవించి ఒక కప్పు దేశవాళీ ఆవుపాలు తాగాలి.
ఈ విధంగా రెండు, మూడు బహిస్టు ల వరకు చేస్తే గర్భాశయం కుచించుకుపోవడం వంటి గర్భాశయ సమస్యలు నివారించబడి శక్తివంతమైన సంతానం కలుగుతుంది అయితే గర్భం ధరించిన తరువాత కూడా ఇదే పద్ధతి లో వాడుతూ ఉండాలి.
- గుండె బలానికి గుండె బలహీనం గా ఉన్న వాళ్ళు, గుండె సమస్యల తో బాధపడుతున్న వారికీ రావి పండ్ల తో కాచిన పాలు వెంటనే మేలుచేస్తాయ్. రోజూ రెండు పూటల రెండు కప్పుల ఆవు పాలలో ఒక చెంచా రావి పండ్ల పొడి కలిపి చిన్న మంట పైన మూడు పొంగులు వచ్చే వరకు మరిగించి దించి తగినంత కండ చక్కెర పొడి కలిపి సేవించాలి
ఈ విధంగా విడవకుండా నలభయి రోజుల పాటు సేవిస్తే గుండె బలహీనత తగ్గిపోయి గుండె కు తగినంత బలం చేకూరుతుంది