స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత | Swastik Symbol Importance in Telugu

0
12432
what-does-swastik-symbol-mean
Swastik Symbol Importance in Telugu

స్వస్తిక్ చిహ్నం ప్రాముఖ్యత

Swastik Symbol Importance in Telugu

 

వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు.

ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన.

“చోడకర్మ సంస్కారము” అంటే ఓ సంవత్సర కాలం తరువాత శిశువుకు తలనీలాలు తీయడం జరుగుతుంది. ఆరవ నెల అన్నప్రాసమైన అనేక రోజులకు ఈ తలవెండ్రుకలు తీసే కార్యాన్ని చేస్తారు.

వెండ్రుకలు తీసిన అనంతరం వెన్న లేక చిలికిన పెరుగును శిశువు సున్నితమైన గుండుపై రాయడం జరుగుతుంది.

ఆ తరువాత శిశువు తండ్రి శిశువు తలపై గంధలేపనంతో స్వస్తిక్ గుర్తుని రాసి నుదిటిపైన బొట్టు పెడుతాడు. స్వస్తిక్ గుర్తు “భగవంతుడి తలంపే శిశువు తలంపవుగాక” అనే అర్థాన్ని ఇక్కడి స్ఫురింపజేస్తుంది.

కాసేపు తరువాత స్వస్తిక్ గుర్తున్న గుండుపై అంతటా గంధలేపనాన్ని రాయడం జరుగుతుంది. ఈ కార్యాన్ని చోడకర్మ సంస్కారం అని అంటారు.

గంధం లో ఔషదీయ గుణాలు ఉంటాయి. గంధలేపనం మెదడును చల్లబరచడమే కాక బుద్ధిని వికసింపజేస్తుంది. తల్లిదండ్రులు మరియు ఈ కార్యానికి వచ్చిన వారు శిశువు ను దీవించి, దీర్ఘాయువును ప్రసాదించుమని భగవంతుడిని ప్రార్థిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here