పురుడు మైల పట్టకపోతే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు పట్టాలి ?
ఒక జీవి రాక, పోకల సమయంలో సూక్ష్మ జగతిలో కొన్ని ఘర్షణలు ఏర్పడతాయి. ఆ జీవునికి సంబంధించిన వారిపై వాటి ప్రభాం వుంటుంది. అది భౌతికంగా కనపడదు. భౌతికమైన వైరస్ లు కూడా కంటికి కనపడవు. కానీ క్రమేణా ఫలితం చూపిస్తాయి.
అలాగే పురుడు, మైల పట్టకపోతే వచ్చిన అశుచి తొలగదు. ఆ సమయంలో దేవతారాధనలు కూడా పనికిరావు. అశుచి వాతావరణంలోకి దేవతలు రారు. అందుకే శుద్ధి అయినంత వరకూ దేవతలను ఆహ్వానించరాదు. వీటిని పాటించకపోతే అశుచి శాశ్వతమై, దేవతల అనుగ్రహం లభించక, విపరీత (నెగిటివ్) శక్తులైన పిశాచాదులు ఇంటినీ, ఒంటినీ ఆక్రమించి వంశంపై ప్రభావం చూపించి మానసిక శారీరక రుగ్మతలకీ, కలహాలకీ కారణమవుతాయి. నమ్మినా నమ్మకపోయినా ఇవి జరుగుతాయి. వాటికి మన నమ్మకాలతో సంబంధం లేదు. నమ్మినవాడు జాగ్రత్తపడతాడు. జాగ్రత్త పడ్డవాడు బాగుపడతాడు.