విలువైన వస్తువులు దొరికితే ఏమి జరుగుతుంది ?

0
14358

అంతరాయం కలిగించే ప్రకటనలను ఆపడానికి మీ యాప్ అప్డేట్ చేయండి.

మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో ధనమో, బంగారమో, లేక మరింకేదైనా విలువైన వస్తువులు అప్పుడప్పుడు, ఏదో ఒక సమయంలో దొరుకుతూ ఉంటాయి. అయితే ఆయా సమయాలలో ఆయా వస్తువులు, లేదా ధనం దొరకడము వలన అది అదృస్టానికి సంకేతమా ! లేక రాబోవు దురదృస్టానికి సంకేతమా అనే అనుమానము వస్తూ ఉంటుంది.
ఇంతకి ఈ విదంగా జరగడం అదృష్టమా ! లేక దురదృష్టమా ?

ఈ అంశము గురించే కాకుండా మరెన్నో విలువైన మరియు రహస్య మైన అనేక అంశాల గురించి మన పూర్వీకులైన ఋషులు ఏనాడో వేదముల ద్వారా, మరియు ఆయా నిమిత్త, జ్యోతిష, శకునాది శాస్త్ర గ్రంధముల ద్వారా తెలియజేయడం జరిగింది.

అందులో ఒకటైన శకున శాస్త్రములో పై విషయమును గురించి చాలా కులాంకుశంగా వివరించడము జరిగినది. ఈ విదముగా విలువైన వస్తువులు దొరికినప్పుడు అవకాశమున్నంతవరకు వాటిని వాటి యజమానులకు చేర్చే ప్రయత్నం అందరం ఎలాగూ చేస్తాము. అయితే అది వీలు కానప్పుడు వాటిని పొందడము వలన దోషం ఉండదు కదా …! అని అందరు భావిస్తారు.

కానీ ఈ విదముగా విలువైనవి దొరకడము మన జాతకములలోని రాహు గ్రహము విజృంభించి ఆ తర్వాతి కాలములో అనేక సమస్యలకు దారి తీయడము గమనించవచ్చు.

ఉదా :- పెళ్లి అయిన వారికి, వారి కుటుంభ సభ్యుల ఆరోగ్య సమస్యల రూపములోను, పెళ్లి కానీ వారికి మానసిక సమస్యల రూపములోను లేక ఎవరి నుండి అయినా మోసం /నష్టం రూపంలో చెడు ప్రాప్తించే అవకాశం ఉంది.

భగవంతుడు మన పూర్వ జన్మ కర్మలను బట్టి మనకు చెడు ఫలితాలను కల్గించబోవు ముందు కొన్ని సమయములలో కొందరిని ఈ విదముగా పరీక్షించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయం లో మనం ఆయా విలువైన వస్తువులను ఏ విదముగా ఉపయోగిస్తున్నాము అనేదాన్ని బట్టి మన భవిష్యత్తు ప్రభావితం అవుతుందని చెప్పవచ్చు.

కాబట్టి ఆవిదముగా విలువైన వస్తువులు దొరికినప్పుడు వాటిని మన సమాజములో నిజం గా అవసరములో ఉన్న వారిని గుర్తించి వారికి సహాయం చేయడము ద్వారా అది సాధ్యం కాకపోతే అధ్యాత్మిక కార్యక్రమముల రూపములో ఖర్చు చేయడము ద్వారా ఆయా సమయములలో మనము రాబోవు రోజులలో మన జాతకమును అనుసరించి జరగబోవు చెడు సంఘటనల నుంచి కొంతమేర అయినా తప్పించుకునే అవకాశము ఉంటుంది.

మూలం : కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రము

రాఘవేంద్ర, ఎం.ఏ .జ్యోతిష్యం, స్వర్ణ పతక గ్రహీత
జూబ్లీహిల్స్ ,రోడ్ నెంబర్ 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here