1. కృత యుగాది అక్షయ తృతీయ
అక్షయ తృతీయ అనబడే వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున శ్రీ మహా విష్ణువు పరశురామావతారాన్ని ధరించాడని పురాణ ప్రతీతి. ఈ రోజున రాహుకాలం, వర్జ్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభాకార్యాన్నైనా జరుపుకోవచ్చని పురోహితులు చెబుతారు. నరసింహ స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా ఈ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. బదరీనాథ్ లోని ఆలయాన్ని ఇవాళ తెరిచి ఉంచుతారు. ఇలా అన్నిరకాలుగా వైశిష్ట్యం ఉన్న రోజు అక్షయ తృతీయ.