మంత్రం అంటే ఏమిటి? | What Is Mantra In Telugu

1
10282
What is a Mantra?
What is a Mantra?

What Is Mantra In Telugu

మననాత్ త్రాయతే ఇతి మంత్రః అని శాస్త్రవచనం. అంటే మననం చేయగా రక్షించునది అని అర్థం. మంత్రం అంటే కొన్ని దేవతల పేర్లు, అక్షరాల కూర్పు కాదు, అవి శక్తిపూరితమైనవి. ఒక మంత్రాన్ని శ్రద్ధ తో మననం చేస్తే మనల్ని శక్తివంతులను చేసి కాపాడుతుంది. ఇరవయ్యో శతాబ్దంలో కూడా మంత్రాలేమిటి? మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అనే మాటలు, సామెతలూ వింటూనే ఉంటాం. చింతకాయలు రాలడానికి మంత్రం అవసరం లేదు. చేతిలో ఒక పొడవైన కర్రో లేక ఒక రాయో ఉంటె చాలు.

మరి మంత్రాలు దేనికి అంటే, దేవతల కృపాకటాక్షాలను మన వరకూ తెచ్చుకోవడానికి. రకరకాల దేవతా మంత్రాలు ఉన్నాయి. చాలా మంత్రాలు ఓం అంటే అక్షరంతో మొదలవుతాయి. తంత్రశాస్త్రాలకు చెందిన మంత్రాలలో వివిధరకాలైన బీజాక్షరాలు కూడా మనకు దర్శనమిస్తాయి. సంస్కృతం నుంచీ పుట్టిన అన్ని భాషలూ ప్రాణాక్షరాలను కలిగి ఉంటాయి. అంటే ప్రకృతికి మూలమైన ప్రాణ శక్తిని నింపుకుని ఉంటాయి. వాటిని మననం చేయడం ద్వారా ప్రకృతిలోని ప్రాణ శక్తి మనలోకి ప్రసరిస్తుంది. తద్వారా శరీరంలోని శక్తి కేంద్రాలు చైతన్యవంతమవుతాయి. శరీరం, మనసు పరిశుద్ధమై ఆయురారోగ్యాలు చేకూరతాయి.

ఏదైనా దేవతకు సంబంధించిన మంత్రమైతే ఆ దేవత యొక్క రూపాన్ని ధ్యానిస్తూ మంత్రం జపం చేయాలి. అలా చేయడమంటే మనలను దేవతకు మానసికంగా అర్పించుకోవడం. ఇదొక భక్తి సాధన. జప సమయంలో ప్రాణాక్షరాల నుంచీ జనించిన శక్తి దేవతల ఆశీస్సులను మనపై వర్షింపజేస్తుంది.

కానీ మంత్రజపం ఎలా పడితే అలా చేయకూడదు. సద్గురువులనుంచీ మంత్రం ఉపదేశ సహితంగా గ్రహించి, దేవతలకు పూజాదికాలు నిర్వహించి, కల్మషరహితమైన మనస్సుతో ప్రతిఫలం మీద ఆశ లేకుండా మంత్రాన్ని సాధన చేయగలగాలి. అలా చేసినపుడే మంచి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఇప్పుడున్న ప్రపంచంలో ఇలా చేయడం దుర్లభం.

మంత్రం యొక్క అర్థాన్ని పూర్తిగా తెలుసుకోవడం కూడా అవసరమే. సంపూర్ణ అర్థం తెలిసినపుడు మాత్రమే ఏకాగ్రత కుదురుతుంది. మంత్రం మనలను రక్షిస్తుంది, మనం చేయాల్సిందల్లా భక్తి, శ్రద్ధ, ఆసక్తి, ఏకాగ్రత, దీక్షలతో సాధన చేయడమే.

శుభమస్తు. జై మహా కాళి.

1 COMMENT

  1. Na age 21 years my name is p.venkatesh,date of birth 22.06.1994 Wednesday evning 5.15pm birth time ….Nenu em chesina Danilo ashishinchina palitham ravadam leydhu em chesina reverse ayipothundhi …plzzz swami na samasyaki salaha chepandi emaina

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here