చంద్ర గ్రహణం అంటే ఏమిటి ? ఎలా సంభవిస్తుంది ? గ్రహణ దోష నివారణకు ఎవరు , ఏ దానాలు చేయాలి

0
2685

⭕? *గ్రహణ నియమాలు ఏ సమయం నుండి పాటించాలి ?*

గ్రహణ వేధారంభ సమయం నుండి గ్రహణ మోక్ష సమయం దాకా గ్రహణ నియమాలను పాటించాలి.గ్రహణ వేధారంభం తేది : 27 – 07 – 2018 , శుక్రవారము మధ్యాహ్నము 12:45 ని॥ల నుండి , గ్రహణ మోక్ష సమయం తేది : 28 – 07 – 2018 , శనివారము , ఉదయం 03 : 41 ని॥ల వరకు గ్రహణ నియమాలను పాటించాలి.

వృద్ధులు , పిల్లలు , వ్యాధి గ్రస్థులు మరియు గర్భిణీ స్త్రీలు తేది : 27 – 07 – 2018 , శుక్రవారము , సాయంత్రం 05:30 ని॥ల నుండి గ్రహణ మోక్ష కాలం వరకు గ్రహణ నియమాలను పాటించాలి.

వయస్సు రీత్యా , వ్యాధి తీవ్రత రీత్యా వృద్ధులు , ఆరోగ్య రీత్యా గర్భిణీ స్త్రీలు అన్ని గంటల పాటు గ్రహణ నియమాలను పాటించలేని , గత్యంతరము లేని స్థితి ఉన్నప్పుడు మాత్రము గ్రహణ స్పర్శ కాలము నుండి గ్రహణ మోక్ష కాలము వరకైనా గ్రహణ నియమాలను పాటించాలి.

⭕? *ఇట్టి చంద్ర గ్రహణం…ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలం కలదు ?*

శుభ ఫలం

 • మేష రాశి
 • సింహ రాశి
 • వృశ్చిక రాశి
 • మీన రాశి

మిశ్రమ ఫలం

 • వృషభ రాశి
 • కర్కాటక రాశి
 • కన్యా రాశి
 • ధనుస్సు రాశి

అశుభ ఫలం

 • మిథున రాశి
 • తులా రాశి
 • మకర రాశి
 • కుంభ రాశి

⭕? *గ్రహణాన్ని ఎవరు వీక్షించకూడదు ?*

మిథున రాశి, తులా రాశి , మకర రాశి , కుంభ రాశి వారువారు మరియు గర్భవతులు గ్రహణాన్ని వీక్షించకూడదు.

⭕? *గ్రహణ దోష నివారణకు ఎవరు , ఏ దానాలు చేయాలి ?*

గ్రహణ మిశ్రమ ఫలం గలవారు అనగా మిథున , వృశ్చిక , మకర , మీన రాశుల వారు , గ్రహణ అశుభ ఫలం కలిగిన వారు అనగా మేష , కర్కాటక , సింహ , ధనుస్సు రాశుల వారు మరియు పుష్యమి , ఆశ్లేషా నక్షత్రం కలిగిన వారు ఒక నూతన కాంస్య పాత్రలో నిండుగా ఆవు నెయ్యి వేసి అందులో వెండితో తయారు చేసిన చంద్రుని ప్రతిమ మరియు నాగ విగ్రహము వేసి పూజించి గ్రహణ మోక్ష కాలం తర్వాత గ్రహణ స్నానమాచరించి సద్భ్రాహ్మణుడికి దక్షిణా సమేతంగా సంకల్పయుక్తంగా దానము ఇవ్వ వలెను.

అపాత్ర దానం శూన్య ఫలాన్నిస్తుంది.కావున మీ మీ ప్రాంతాలలో ఉన్న సదాచార సంపన్నులు , నిష్ఠా గరిష్ఠులు , నిత్య జపతప హోమ యాగ క్రతువులు , నిత్య దేవతార్చన చేయువారు, వేదాధ్యయనము చేసిన పండితులకు దానము ఈయవలెను.అప్పుడే దాన ఫలితము లభించును.

⭕? *అందరూ క్రింది చంద్ర గాయత్రిని గ్రహణ సమయములో జపము చేసుకోవచ్చు.*

ఓం క్షీర పుత్రాయ విద్మహే , అమృత తత్వాయ ధీమహి
తన్నో చంద్ర ప్రచోదయాత్ .

⭕? గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి , నదీ తీరములో అనుష్ఠానము చేసుకోవడము సంపూర్ణ ఫల ప్రదము , పుణ్య ప్రదము.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here