
Fasting (Upavasam) Benefits in Telugu?
1. లంఖణం పరమౌషధం
ఉపవాసము అనగా ఉప=స్వామి సమీపము నందు, వాసః=నివసించుట. అనగా స్వామి యొక్క గొప్పదనమును తెలుసుకొను సత్సంగములలోను, స్వామిపైనున్న ప్రేమను వ్యక్తము చేయు భజనలలోను నిమగ్నమై ఆహారమును అప్రయత్నముగా తీసుకొనకపోవుట. అన్నము అనగా నోటితో స్వీకరింపబడునది అని అర్ధము. అసలు ఉపవాసమునకును అన్నమునకును ఎట్టి సంబంధములేదు. నోటితో ఏమి తీసుకున్నా అది ఉపవాసము అవదు. ఏ రోజు స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమై పోయి వంట చేయుటకు కూడా సమయము లేక భోజనమును అప్రయత్నము గావదలి వేయుదురో అదే ఉపవాసము. భగవంతునిలో లీనమగుట అంత ఉన్నత స్ధాయికి పోలేక మధ్యలో ఆకలి అయితే క్షీర ఫలాదులను స్వీకరింతురు. “పయో బ్రహ్మణస్య వ్రతమ్” అని శ్రుతి. అనగా బ్రహ్మజ్ఞాన సత్సంగములను చేయువారు మధ్య మధ్యలో క్షీరపానము చేయవలయునని అర్ధము. దీనిచే శక్తి లభించును. మరియు పాలు సులభముగా జీర్ణమగుట వలన తమో గుణమైన మత్తురాదు. ఫలములు కూడా పాల వంటివే. ఆ విధముగా ఎవరు రోజంతయును సత్సంగములతో భజనలతో గడుపుదురో శక్తి కొరకు పానీయములను మాత్రము నోటిద్వారా తీసుకొందురో వారినే ఉపవాసము చేయువారందురు
Chala baga chypyru
Chala bagundhi sir manchiga vivarincharu
Chala vivaramuga charu sir