
Fasting (Upavasam) Benefits in Telugu?
2. కారణాంతరములు
స్వామి యొక్క సత్సంగములో నిమగ్నమై పోయి , భజనలలోను నిమగ్నమై ఉన్నవారికి మలమూత్రాదులు , అపానవాయువుల అంతరాయము ఉండును గనుక ఉపవాసము చేయుట ఉత్తమము. ఉపవాసము చేయుటవలన వాటినుండి కొంతవరకు లేదా పూర్తిగా బయటపడవచ్చును. ఇదే ఉపవాసము లోని అంతరార్ధము.
ఆధునిక జీవన విధానము లో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి. చక్కటి ఆరోగ్యానికి ఉపవాసము దివ్యౌషధం. శరీరములోని జీర్ణ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలు శుభ్రపడి ఆరోగ్యము చేకూరుతుంది.
ఉపవాసం అంటే మొత్తం గా కడుపు మాడ్చుకోవాలి అని ఏ శాస్త్రము, సైన్సు చెప్పదు. ఒక పూట లంఖణం చేస్తే అన్నీ శరీరభాగాలూ ప్రభావవంతమవుతాయి. అందుకే నెలకొకసారి, వారానికొకసారి లేదా 15 రోజులకొకసారి ఉపవాసం చేయడం ఉత్తమం. ఆ రోజు అన్నం లాంటి ఘన పదార్థాలేమీ తినకుండా కేవలం ద్రవాహారం మాత్రం తీసుకోవచ్చు అంటారు. అలాగని కాఫీలు టీలు తాగకుండా చక్కగా పాలు, మజ్జిగ, కొబ్బరినీళ్ళు తాగితే మంచిది. మంచినీళ్ళు ఏదో ఒకటో రెండో గ్లాసులు తాగుతాం రోజు మొత్తం మీద. నీరు సరిపడా తాగాలి.
Chala baga chypyru
Chala bagundhi sir manchiga vivarincharu
Chala vivaramuga charu sir