ఈరోజు -ప్రదోషవ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ? | Pradosha Pooja Vratham in Telugu

0
17715
what-is-the-importance-of-pradosha-time-and-whom-to-worship
ఈరోజు -ప్రదోషవ్రతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? ఎవరిని పూజించాలి ? | Pradosha Pooja Vratham in Telugu

pradosha pooja vidhi

మహాశివుని మెప్పించే మహత్తర మార్గం శివ ప్రదోష స్తోత్రం

శని వారము, త్రయోదశి,ప్రదోషము మూడు కలిసి రావడం చాలా అదృష్టదాయకం. గ్రహాపీడా నివారణలకూ, శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్నావారికీ ఈ శని ప్రదోష సమయం దైవానుగ్రమనే చెప్పుకోవాలి.

దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్నే “ప్రదోష కాలం” అంటారు. సూర్యుడు అస్తమించే సమయం లో తిథి మారితే అది ప్రదోషకాలం . “ప్రదోషో రజనీ ముఖం” అంటారు. అంటే ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది.  ఈ సమయం లో పరమశివుడు పార్వతీదేవితో కలిసి అర్ధనారీశ్వర రూపంగా దర్శనమిస్తాడు. ఆనంద తాండవాన్ని చేస్తాడు. ప్రమశివుడు ప్రదోష కాలం లో పార్వతీ సమేతుడై ప్రమధ గణాలతో కొలువై అత్యంత ప్రసన్న మూర్తి గా  భక్తులు కోరిన కోర్కెలన్నిటినీ నెరవేరుస్తాడు. ప్రదోష సమయం లో పూజించిన వారిని గ్రహదోషాలు, ఇతర పాపాలు వ్యాధులనుండీ విముక్తులను చేస్తాడు. కృష్ణపక్ష త్రయోదశి లో ఒచ్చే ప్రదోషాన్ని ‘మహా ప్రదోషము’ అంటారు.  శుక్ల పక్ష ప్రదోషం కూడా ప్రత్యేకమైనదే.

ప్రదోష సమయం ఎప్పుడు వస్తుంది ? ఎంతసేపు ఉంటుంది..?

త్రయోదశి నాడు సాయంత్రం నాలుగున్నర గంటలనుండీ అర్ధరాత్రివరకూ ప్రదోషకాలంగా పరిగణించ వచ్చు. సూర్యాస్తమయానికి ముందు రెండున్నర ఘడియాలూ సూర్యాస్తమయం తరువాత రెండున్నర ఘడియల కాలాన్ని కలిపి ప్రదోషమని కొందరు పండితులు చెబుతారు. ఘడియ అంటే 24 నిముషాలు.

ప్రదోష సమయం లో చేయవలసిన పూజా విధానం ఏమిటి?

ప్రదోష కాలానికి ముందుగా స్నానం చేసి శివారాధన చేయాలి. ప్రదోష సమయం లో శంకరుడు అమ్మవారితో కలిసి ఆనంద తాండవం చేస్తాడు. ఆ సమయం లో స్వామి ఆనంద తాండవం చేస్తున్న  దివ్యమంగళ నటరాజ  రూపాన్ని కొలిస్తే సర్వపాపాలూ హరిస్తాయి.  మహాశివుడు అభిషేక ప్రియుడు కనుక మంత్రోక్తంగా పంచామృతాలతో ఆయనను అభిషేకించాలి. ఇది వీలు పడని వారు ఆలయానికి వెళ్ళి ప్రదోష సమయం లో అభిషేకం చేయించవచ్చు.

ప్రదోషకాలం లో శివప్రదోష స్తోత్రాన్ని పఠించడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here