శాస్త్రాలు అన్ని ఆన్ లైన్ మరియు లైబ్రరీ లో దొరుకుతున్నపుడు గురువులు ఎందుకు?

0
2859

Archivo baseఅనేక శాస్తాలు చదవడానికి లభిస్తున్నాయి. అటువంట ప్పుడు అవి చదివి తెలుసుకోవచ్చుకదా?

మరి గురువు అవసరం ఎందుకు?

ఉపదేశం లేకుండా, పుస్తకంచూసి అనుష్టానం చేయవచ్చుకదా? 

ఇవి మనకు సాదారణంగా వచ్చే సందేహాలు, భౌతిక శాస్త్రాలు కూడా పుస్తకాలు దొరకుతున్నాయి. కానీ విద్యాలయాలకి వెళ్ళి ఉపాధ్యాయుల ద్వారా బోధింప జేయడమెందుకు? అలాగే గురువులద్వారానే ఆధ్యాత్మికవిద్యలు ఎందుకు నేర్వాలి? – ఔషధాలను పుస్తకాలుచూసి ఎంపిక చేసుకోడు రోగి. వైద్యుని ద్వారా నిర్దేశింపబడ్డవి మాత్రమే స్వీకరించాలి. అలాగే ఎన్ని మంత్రాలు పుస్తకాల్లోఉన్నా అవి ఎవరికి, ఎప్పుడు, ఎందుకు ఎలా అందివ్వాలో గ్రహించే అనుభవజ్ఞడు అవసరం. అతడే గురువు. అందునా – అనేక శాస్తాలు, అనేక విషయాలు చెప్తాయి. అవి అయోమయానికి హేతువు కావచ్చు. వాటిని చక్కగా సమన్వయపరచి చెప్పే శాస్త్రజ్ఞడు గురువు. మనకి ఏది ఎంతవరకు అవసరమో గురువుకి తెలుస్తుంది.

అయితే సరియైన అర్ధాన్ని అన్వయాన్నిచెప్పే గురువును గ్రహిం చడంలో మన వివేకం ఉపయోగపడాలి. భాగ్యం కలిసిరావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here