మన పురాణాలు కేవలం వేదాంతాన్ని మాత్రమేకాకుండా నిత్యజీవన సత్యాలను ఎన్నింటినో నేర్పించే విజ్ఞాన భాండాగారాలు. పురాణాలు కేవలం ముక్తికోసమే కాదు. నడతనూ నడవడికనూ తీర్చి దిద్దడానికి. జీవితం అగమ్య గోచరమైన వేళ కర్తవ్యాన్ని బోధపరచడానికి. జీవితం లోని ఒక్కో వయసులో ఒక్కో పురాణం చదవాలంటారు పెద్దలు.