
Significance Of Naga Panchami?
1నాగ పంచమి
ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.”నాగులచవితి” మాదిరిగానే ”నాగ పంచమి” నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు.
నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.
చలి చీమ నుండి … చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి – రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది .
హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే .
వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు . వాసుకి పమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.