
What is Upanayanam in Telugu?
ఉపనయనం అంటే ఏమిటి? | What is Upanayanam in Telugu? | ఉపనయనం బాల్యం విడిచి కౌమారం లోకి అడుగుపెట్టే మగపిల్లలకు చేస్తారు. ఉపనయనంతో బ్రహ్మ చర్య దీక్షను ఇస్తారు.
ఆ నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను.
వివాహానికి ముందు బ్రహ్మ చర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు.ఉపనయనము ఉత్తరాయణ కాలంలో మాత్రమే చేయవలెను.
ఉపనయన ముహూర్తము తండ్రి జన్మ నక్షత్రం మరియు బాలుని జన్మ నక్షత్రంపై ఆధారపడుతుంది.
ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు అని కూడా అంటారు.
బాల్యావస్థ నుండి బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠలతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది.
ఉపనయనానికి ముందు ఒక జన్మ తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు.
మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు.
అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.
ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.
Indian Culture Posts
పూజచేసే సమయంలో కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమా ? | Spoiled Coconut in Pooja Is it a Bad Sign?
మాంగల్య బలం పెరగాలి అంటే ఏమి చెయ్యాలి ? | What to Do to Increase Mangalam Strength in Telugu ?
జంద్యం ఎందుకు ధరించాలి? | Why Should we Wear Janeu in Telugu
దేవాలయం కు వెళ్ళినపుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి ? | How to behave when we visit temples in Telugu?
ఏ దేవుడుకు యే దీపం పెట్టాలి ? | Types of Lamps to be use for Different Gods in Telugu?
తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉండాలి ? | Responsibility of Parents in Telugu