Know Your Lucky Color According To Your Zodiac Sign
ఏ రాశి వారికి ఏ రంగు వల్ల అదృష్టం కలిసి వస్తుంది? (Know Your Lucky Color According To Your Zodiac Sign)
జన్మ రాశుల ప్రకారం ఒక్కో రాశి వారికి ఒక్కో గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఆ గ్రహం ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. గ్రహ స్వభావాన్ని బట్టి ఒక్కో రాశిపై రంగుల ప్రభావం మారుతుంది. కొన్ని రాశులకు ఒకే గ్రహం అధిపతి అయినా గ్రహ స్థానాన్ని బట్టి వేరు వేరు రాశుల వారికి వేరు వేరు రంగులు అదృష్ట కారకంగా చెప్పబడ్డాయి. గ్రహానుకూలమైన రంగులను ధరించడం వలన అనుకూల పరిస్థితులు ఏర్పడి, అదృష్టం కలిసి వస్తుంది.