తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉండాలి ? | Responsibility of Parents in Telugu

0
3513
Traditional_Gaye_Holud_of_Groom_in_Dhaka
తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉండాలి ? | Responsibility of Parents in Telugu

తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉండాలి ? | Responsibility of Parents in Telugu

 
Responsibility of Parents in Telugu సుపుత్రో  సప్తమోరసః అనే నానుడి.  అన్యోన్యమైన దాంపత్యంలో కలిగే సుఖం కన్నా ఉత్తమ సంతానం వలన కలిగే ఆనందం వర్ణనాతీతం.  పిల్లలు మీ ప్రతిబింబాలని మరువకండి.  మీలో కలిగే ప్రతీ భావాలు, గుణాలు, సంస్కార రూపంలో వారిలో దాగుంటాయి.  కనుక మీ భావాలను, గుణాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటుండాలి. మీ ప్రవర్తన వారికి ఆదర్శవంతం కావాలి.
 
మీ తదనంతరం ఈ భూమిపై కొనసాగే మీ వారసులు ఎలా జీవిస్తే మీ వంశానికి, సమాజానికి హితం చేకూరుతుందో గ్రహించి ఆ మార్గంలో వారిని తీర్చి దిద్దేందుకై కృషి చేయండి. స్వార్థంతో రాగ ద్వేషాలకు లోబడి మానసిక వత్తిడికి, ఘర్షణకు గురికాకుండా సమర్థవంతులైన తల్లిదండ్రులు గా యోగ్యమైన భావితరానికి మార్గదర్శకులై మీ బాధ్యతలను నెరవేర్చుకోవాలి.
 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here