దానం చేయాలంటే పుచ్చుకోనేందుకు బ్రాహ్మణుడు లేకపోతే ఆ దానాన్ని,పెసలు, కందులు, నువ్వులు ఏదైతే ఉన్నదో అది నీళ్ళల్లో నానబెట్టి గోవుకు బెల్లంతో పాటుగా తినిపించాలి. అప్పుడు అది దానం చేసిన దానితో సమానము అని పెద్దలు చెప్పినారు. ఆ పెసలను (దానమును) గోవు తింటే దానం ఇచ్చిన దానితో సమానము. గోవు తింటే అది బ్రాహ్మణులకు ఇచ్చినట్లే. గోవులో బ్రాహ్మణులు నివసిస్తూ వుంటారు. లేదంటే ప్రవహించే నదిలో విడిచి పెట్టాలి.