Shani Trayodashi In Telugu
1. శనివారమూ త్రయోదశీ ఒకే రోజు వస్తే ఏమి చేయాలి..? (What should be done if Saturday and Troyodasi fall on the same day..?)
శని వారమూ త్రయోదశీ ఒకేరోజు రావడం చాలా విశేషమైనది. శని బాధలనుండీ విముక్తి పొందాలంటే అటువంటి శని త్రయోదశి నాడు ఆ శనీశ్వరుని విధి విధానాలతో ప్రార్థించాలి. ఈరోజు శని దేవుని పూజించడం వలన జాతకం లో ఏలినాటి శని, అష్టమశని, అర్ధాష్టమ శని, శని అంతర్దశ విదశ దోషాలను ,మీ జాతకం లో శనిప్రభావం వల్ల కలిగే ఎన్నోరకాల బాధలనుండీ ఉపశమనాన్ని పొందవచ్చు. వైశాఖ మాసం లో వచ్చే శని త్రయోదశినాడు శనీశ్వరుని జన్మదినం. ఆరోజు శని పూజ చేయడం వల్ల అనేకలాభాలుంటాయి. ఆరోజు మాత్రమే కాకుండా ఏ మాసం లో అయినా శనివారం వచ్చే త్రయోదశి నాడు పూజ చేయడం వలన కూడా అదే ప్రభావాన్ని పొందవచ్చు.
Promoted Content
??????????