How to Have White Teeth
అరటిపండుతొక్క లోపలి పొరను తీసి పచ్చగా ఉన్న దంతాలమీద రోజు రెండు నిమిషాలుపాటు రుద్దితే అందులో పొటాషియం,మెగ్నీషియం కారణంగా తెల్లగా మెరుస్తాయట.
దంతాలు ఇలా భద్రం..!
- దంత ఆరోగ్యంలో కీలకమైనది దంతాల పరిశుభ్రత. రోజుకి రెండుసార్లు దంతధావనం తప్పనిసరిగా చేయాలి.
- దంతాలకు ఆహారం అతుక్కోకుండా చూసుకోవాలి. తినగానే తప్పనిసరిగా పుక్కిళించాలి.
- మనం నమిలేటప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి బాగా నమలి తినడం ఒత్తిడినీ తగ్గిస్తుంది.
- చూయింగ్ గమ్ మంచిదే. దంతాలకు వ్యాయామం నమలడం వల్ల. చక్కెర లేని చూయింగ్ గమ్‌లు నమిలితే మరీ మంచిది.
- తాజా పండ్లు ఎక్కువగా తినాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి.
- పిల్లలకు చెరుకు లాంటి ఎక్కువగా నమిలే పదార్థాలను పెట్టడం వల్ల దంతాలు దృఢంగా తయారవుతాయి.
- మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బలమైన దవడలు, దంతాలు ఏర్పడ్తాయి. కాబట్టి మంచి ఆహారమే దంతాలకు క్షేమకరం. గర్భిణులకు కాల్షియం సప్లిమెంట్లు అందుకే ఇస్తారు. కాని టెట్రాసైక్లిన్స్ లాంటి యాంటిబయాటిక్స్, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాల మందుల వల్ల గర్భస్థ శిశువుపై ప్రభావం పడుతుంది. వాటివల్ల తరువాత ఏర్పడే దంతాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి గర్భిణులుగా ఉన్నప్పుడు యాంటిబయాటిక్స్ లాంటి మందులతో జాగ్రత్త.
- 6 నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి దంతాలను డాక్టర్ చేత శుభ్రం (స్కేలింగ్) చేయించుకోవాలి. దీని వల్ల దుర్వాసన రాదు. దంతక్షయాన్నీ నివారించవచ్చు.
- పొగతాగడం, ఆల్కహాల్, గుట్కా లాంటి అలవాట్లు దంతాలకు శత్రువులు….