మాంసాహారం ఎప్పుడెప్పుడు తినకూడదు..?

1
32921
whencan we not eat meat
what is the time to avoid eating non veg

సాధారణంగా పూజలు, వ్రతాలు, దీక్షలు చేసేటప్పుడు. పుణ్యదినాలలో మాంసాహారాన్ని భుజించడం నిషిద్ధం. ఎందుకంటే మాంసాహారం తమో గుణాన్ని, రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది. ఆధ్యాత్మికమైన పనులు చేసేటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. సాత్విక భావనల తో భగవంతుని స్మరించాలి. అంతేకాకుండా మాంసాహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది. ఆ జీర్ణ క్రియ ప్రభావంతో మెదడు తాత్కాలికంగా చురుకుదనాన్ని కోల్పోతుంది. అందుకని దైవకార్యాలు చేసేటప్పుడు, దైవ దర్శనానికి వెళ్ళే ముందు మాంసాహారాన్ని తినకూడదని పెద్దలు చెబుతారు.

మాంసాహారం తిన్నప్పటికీ స్నానం చేసి లేదా తలంటు స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చని కొందరు భావిస్తారు. కానీ అది ఎంతమాత్రమూ సరికాదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here