
Panchmukhi Hanuman Evaluation in Telugu
1. పంచముఖ ఆంజనేయుని అవతార కథ
పంచముఖ ఆంజనేయ స్వామి రూపం చాలా ప్రసిద్ధమైనది. రామ రావణ యుద్ధం లో పంచముఖ ఆంజనేయుని ప్రసక్తి కనిపిస్తుంది. రామ రావణ యుద్దము నందు, రావణుడు మహీరావణుడి సాయం కోరుతాడు, పాతాళానికి అధిపతి మహీరావణుడు. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన వాల శయనమందిరము ( తోక తో ఏర్పాటు చేసినది) నుండి రామ లక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపం లో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకొన్న ఆంజనేయుడు శ్రీ రామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు. పాతాళం లో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపలను ఒకేసారి విచ్చిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగ, గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి ఆర్పి శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.
Promoted Content