
Dasara Pooja Vidhanam – శరన్నవరాత్రి విధి విధానాలు ఇలాగే చేయాలి అని ఎక్కడా లేదు. వివిధములైనటువంటి ప్రత్యామ్నాయాలు కూడా చెప్పారిక్కడ. ముఖ్యంగా శరన్నవరాత్రులు పూజకు ప్రధానమైనటువంటివి. ఈ పూజ ఎప్పుడూ త్రికాలములయందు చేయాలని శాస్త్రం చెప్తోంది. అంటే ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. మూడు కాలములలోనూ పూజ చేయాలి. అయితే ఇందులో ఒక పూజ విశేషంగా చేస్తూ మిగిలిన పూజలు లఘువుగా చేయవచ్చు. రాత్రి ప్రధానంగా చేసిన వారు ఉదయం నుంచి ఉపవాసం లేదా ఏకభుక్తం చేస్తూ వ్రతం చేస్తారు.
ఆటువంటప్పుడు రాత్రిప్రధానంగా ఆరాధన చేయడం ఉన్నది. కానీ రాత్రి చేస్తున్నాం కదా అని ఉదయ మధ్యాహ్నాలు మానేయ రాదు. మొత్తం మూడుపూటలా చేయాలి. కనీసం రెండు పూటలైనా చేయాలని చెప్పారు. ఉదయం, సాయంత్రం. ఉదయ పూజ చాలా అవసరం ప్రాతఃకాల పూజ. ఒకవేళ రాత్రి విశేష పూజ చేస్తారు అంటే ఉదయం సంక్షిప్తంగా చేసుకొని రాత్రి విశేష పూజ చేయవచ్చు. లేదా ఉదయం విశేషంగా చేసుకొని రాత్రి సంక్షిప్త పూజ చేయవచ్చు. అందుకు రెండు పూటలు గానీ, మూడు పూటలు గానీ ఈ దివ్యమైన ఆరాధన చేయవచ్చు అని మనకి ధర్మశాస్తాలు చెప్తున్నటువంటి అంశం.
నవరాత్రి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఏవిధంగా చేయాలి? కలశాన్ని ఏమి చేయాలి?