
2. తులసి చెట్టు ఏ దిక్కున ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి?
తూర్పు- వాయవ్యం లేదా ఉత్తర- వాయువ్యాలలో తులసి కోటను నిర్మించేటప్పుడు కోట అడుగు నేలకన్నా తక్కువ ఎత్తులో ఉండాలి. తులసికోట చుట్టూ ప్రదక్షిణం చేసేందుకు వీలుగా ఖాళీ స్థలం ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దు గోడలను(కాంపౌండ్ వాల్ ను) ఆనుకుని తులసి కోట ఉండరాదు.
దక్షిణం దిక్కులో తులసి కోటను నిర్మించుకోదలచినవారు నేల మట్టానికి సమానంగా ఉండకుండా చూసుకోవాలి. కొంచెం ఎత్తు లేదా మరి కొంచెం పల్లంలోగానీ నిర్మించాలి. అలాగే పశ్చిమ దిక్కులో తులసికోటను ఏర్పాటు చేయాలంటే నేల ఎత్తుగా లేక లోతుగా ఉండాలి.
Promoted Content