మతిమరపు జబ్బు వదిలించే ఫలము | Fruit is Usefull to Forgetfulness Disease

0
22032
మతిమరపు జబ్బు వదిలించే ఫలము
fruit is usefull to forgetfulness disease

fruit is usefull to forgetfulness disease

ఆయుర్వేదంలో ప్రస్తావించిన వాత, పిత్త, కఫ గుణాలను దానిమ్మ నియత్రిస్తుంది. తరచుగా దానిమ్మ పళ్లను తీసుకునేవారిలో మతిమరుపు సమస్య తలెత్తదు. చక్కని జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. దానిమ్మ వేరు, కాండాలలో రోగ నిరోధకశక్తిని పెంచే గుణాలున్నాయి. దానిమ్మ పువ్వులు దంతాలకు మేలు చేస్తాయి. దానిమ్మ పండును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాక గుండె జబ్బులను నివారిస్తుంది.

డయేరియా సమస్యతో బాధపడేవారు దానిమ్మ రసాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ప్రొస్టేటు క్యాన్సర్ నివారించడానికి దానిమ్మ రసాన్ని ఉపయోగిస్తారు. రక్తం గడ్డకట్టకుండా నివారించే ఆస్పిరిన్‌లో ఉన్న లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి.

చర్మ సౌందర్యానికి కావలసిన మాయశ్చరైజర్‌గా దానిమ్మ నూనె ఉపయోగపడుతుంది. వాపులు, నొప్పులు పోగొట్టడానికి దానిమ్మ నూనెను విరివిగా ఉపయోగిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here