వాహనాలకు నిమ్మకాయలు ఎందుకు కడతారు? | Why Lemons are Tied to Motor Vehicles in Telugu

0
2249
వాహనాలకు నిమ్మకాయలు ఎందుకు కడతారు? | Why Lemons are Tied to Motor Vehicles in Telugu
Why Lemons are Tied to Motor Vehicles in Telugu

Why Lemons are Tied to Motor Vehicles – మ్మకాయలు, తియ్యగుమ్మడి వంటివాటిని ఉగ్రదేవతాశాంతికి వినియోగిస్తారు. వాహన ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి గాను సాత్విక‌  దేవతల కంటే ఉగ్రదేవతలనే ఎక్కువగా నమ్ముతారు. సాధారణంగా హనుమంతుని ఆలయంలో వాహన పూజలు జరిపిస్తారు. దైవానికి నివేదించిన నిమ్మకాయలను వాహనాలకు కడతారు. దిష్టితీసి చక్రాలతో తొక్కిస్తారు. ఇందువల్ల మేలు జరుగుతుందని ఆశిస్తారు. పుల్లగా ఉండే నిమ్మకాయ రసం, కారం నిండి ఉండే మిరపకాయలను వాహనాలకు, దుకాణాల వద్ద వేలాడదీయడం వెనుక జ్యోతిష శాస్త్ర కారణం ఉంది. గ్రహాలలో ఎర్రనిది, ఉగ్రత్వం కలిగినది కుజగ్రహం. కుజుడు ప్రమాద కారకుడని శాస్త్రనమ్మకం. కుజుని అధిదైవం హనుమంతుడు. అలాగే గ్రహాల్లో శుక్ర గ్రహానికి చెందిన రుచి పులుపు. అభివృద్ధికి, సంపదకు శుక్రుడు కారకుడు. కారం రవిగ్రహానికి చెందినది. అధికారానికి రవి కారకుడు. వీరు వాహన చోదకుని పట్ల శాంతులై ఉండాలని కోరుతూ వాహనాలకు నిమ్మకాయలు, మిరపకాయలు కడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here