హిందువులు పండుగ సందర్భాలలో రంగవల్లులు ఎందుకు వేస్తారు? | Why Do Hindus Draw Rangolis During Asuspicious in Telugu

0
4475
12190043_1625813634334466_7367938833649902088_n
హిందువులు పండుగ సందర్భాలలో రంగవల్లులు ఎందుకు వేస్తారు? | Why Do Hindus Draw Rangolis During Asuspicious in Telugu

Rangoli Importance / హిందువులు పండుగ సందర్భాలలో రంగవల్లులు ఎందుకు వేస్తారు?

దక్షిణ భారతదేశంలో ప్రతి ఉదయం లోగిళ్ళ ముందు అందమైన రంగవల్లికలు వేస్తారు. ప్రతి హిందూ పండుగకు వివిధ రంగులు లేదా పూలతో అలంకరించిన ఇంటి ముంగిట ఈ అందమైన రంగవల్లికలను చూస్తారు. ఈ రంగవల్లికలను భారతదేశం వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.

ఈ అందమైన రంగవల్లికలను రంగోలి లేదా ముగ్గు లేదా పూకళం లేదా అల్పన అని పిలుస్తారు. ప్రతి ప్రాంతానికి ముగ్గుల్లో తేడా ఉంటుంది. కేరళ ప్రజలు పూకళం అని పిలిచే ఈ రంగవల్లికలను పువ్వులతో మరియు ఆకులతో వేస్తారు. పశ్చిమ బెంగాల్లో, అల్పన అని పిలిచే ఈ రంగవల్లికలను రుబ్బిన బియ్యపు పిండితో వేస్తారు. దక్షిణ భారతదేశంలో కూడా ముగ్గును బియ్యపు పిండితో వేస్తారు. ప్రాంతాల వారీగా పేర్లు వేరైనా ముగ్గును వేసే ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే.

ముగ్గు అదృష్టాన్ని తెస్తుందని ఒక నమ్మకం. గృహంలోకి దేవతలను ఆహ్వానించటానికి గుర్తుగా కూడా చెపుతారు. ముగ్గు వేయటానికి సాధారణంగా పొడి లేదా తడి బియ్యం వాడతారు మరియు తరువాత పసుపు లేదా కుంకుమతో అలంకరిస్తారు.

ఇతిహాసాల ప్రకారం, ఒకానొకప్పుడు ఒక రాజు తన కుమారుడిని కోల్పోయాడు. కాబట్టి, ఆ రాజు బ్రహ్మదేవుడిని తన కుమారుడిని బ్రతికించమని ప్రార్ధించాడు. దీర్ఘ తపస్సు తరువాత, బ్రహ్మదేవుడు బాలుడిని బ్రతికించటానికి అంగీకరించాడు. బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో రాకుమారుడు యొక్క బొమ్మను గీయమని రాజుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి రాకుమారుడికి జీవం పోస్తానని చెప్పాడు. ఆ సమయం నుండి, ముగ్గు అన్నది జీవితం, అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా ఉనికిలోకి వచ్చింది. రంగవల్లులు, పురాతన కాలంనాటి ప్రధాన అలంకరణలలో ఒకటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here