
ప్రాణ శక్తికి ప్రతిరూపం కొబ్బరి
మనిషి ఆయువు తీిరేవరకు ఏ వ్యాధులు సోకకుండా పూర్తి ఆరోగ్యం తో జీవించాలంటే అతని లో ఎల్లవేళలా ఎడతెరగని వ్యాధి నిరోధక శక్తి ఉండి తీరాలి. ఆ ప్రాణశక్తి పరిపూర్ణం గా ఉన్న మానవుణ్ణి ఏ కాలుష్యాలు, ఏ క్రిమికీిటకాలు, ఏ ప్రాణాంతక వ్యాధులు బాధించలేవు. అతడు మట్టి లో, బురద లో, వాన లో, చలి లో, ఎండ లో ఎక్కడ పని చేసిన కూడా ఏ అనారోగ్యం అతన్ని బాధించదు.
మరి అంతటి వ్యాధి నిరోధక శక్తి, అకాల వార్ధక్యాన్ని వ్యాధులను నిరోధించగల రసాయన శక్తి ప్రకృతి లోని ఏ పదార్ధాలలో పుష్కలంగా లభ్యమవుతుందో తెలుసుకోవడం కోసం మన పెద్దలు ప్రాచీన శాస్త్రవేత్తలు అనబడే మహర్షులు సాగించిన పరిశోధనలో లభించిన ప్రకృతి వర ప్రసాదమే కొబ్బరి
కొబ్బరి కాయ కొట్టడం ఎందుకు
అఖండ జ్ఞాన సంపన్నులు. మహర్షులు ముందుగా తమ దేహం లోని దైవాన్ని కనుగొని దేహమే అసలైన దేవాలయం అని , ఆ దేవాలయం లో కొలువైన పరమాత్మ అనబడే దైవానికి శక్తివంతమైన ఆహారాన్ని అందించడమే నిజమైన పూజ అని తెలుసుకొన్నారు.
ఈ రహస్యం సామాన్య మానవులకు సులభంగా అర్ధం అయ్యేది కాదు కాబట్టి, దేహానికి ప్రతి రూపం గా దేవాలయాన్ని పరమాత్మ కు ప్రతి రూపం గా మూలవిరాట్టు ను సృష్టించి ప్రజలంతా ప్రతి రోజూ ఈ దేవలయానికి వచ్చి కొంత సమయం ఇక్కడ దేవుణ్ణి ఆరాధించి ఇక్కడ పంచి పెట్టే కొబ్బరి ముక్కల ప్రసాదాన్ని విధిగా సేవించి వెళ్ళాలనే ఒక అమృతాచారాన్ని అలవాటు చేశారు.
నిరుపేదలు ప్రతి రోజూ కొబ్బరి కాయ ను కొని తినడం అసాధ్యం కాబట్టి వారికి కూడా రోజూ కొబ్బరి ఫలహారం గా అందడం కోసం గుడి ని వేదిక గా నిర్ణయించారు కాబట్టి ధనవంతులు దేవుని వద్ద కొబ్బరి కాయలు కొట్టాలని అందులో సగం మాత్రమే వారికి ఇవ్వబడతాయి అని మిగిలిన సగం ప్రజలందరికి పంచి పెట్ట బడతాయి అని మహర్షులు నిర్ణయించడం జరిగింది
కొబ్బరి కాయ కొట్టడం వెనుక ఇంత ఆచారం ఉంది ఆచారాలలో కూడా ఇంత సైన్స్ దాగి ఉంది
కొబ్బరి కాయ లో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు , పోషకాలు దాగి ఉన్నాయి ఆచారాలను పాటించడం మన సంప్రదాయం ఆధునిక సమాజం సంప్రదాయ లను విస్మరించి అనారోగ్యాలు పాలవుతున్నారు