దేవాలయంలో ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఎప్పుడూ నమస్కరిస్తూనే ఎందుకు కనిపిస్తాడు ?

0
621

 

రావణవధ అయ్యాక సీతారాములు వెళ్ళిపోతూ ఆంజనేయుడితో ” నీకేం కావాలి?” అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు నాకు మరేవిధమైన కోరికలూ వద్దు.

ఏరూపం చూచినా అందులో నీ రూపమే కనిపించేలాగ, ఏ శబ్దం వినిపించినా అందులో సీతారాముల కథే వినిపించేలా, ఎక్కడ నమస్కరించినా అది మీకే చెందేలాగ ఈ భావం నాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు అని కోరుకొన్నాడు. దానికి రాముడు సరే అన్నాడు. అందుకని ఆంజనేయుని నమస్కారం సీతారాములకే. ఆంజనేయ ధ్యానమంతా సీతారాముల విషయంలోనే.

అంతేకాదు సీతారాములకి నమస్కరిస్తున్న హనుమకి నమస్కరించడం ఆ సీతారాములకి మరింత ఇష్టం.

ఎందుకంటే భగవంతుడు తనకి చేసిన నమస్కారం కంటే తన భాగవతునికి ( భక్తునికి ) చేసిన నమస్కారానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తాడు కదా!! (అహం స్మరామి మద్భక్తం.)


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here