పొద్దు తిరుగుడు పువ్వు సూర్యునివైపే ఎందుకు తిరుగుతుంది? | Why Does Sun Flower Turns Towards the Sun in Telugu?

0
6734

poddu tirugudu

పొద్దు తిరుగుడు పువ్వుని సూర్యకాంత పుష్పం అనికూడా అంటారు. పొద్దు ఎటు తిరిగితే అటు తిరగడం వల్ల అది పొద్దుతిరుగుడు పువ్వుగా పిలుస్తాము.

పొద్దు తిరుగుడు పువ్వు గురించి గ్రీకుల కథ : 

సూర్య భగవానుని గ్రీకులు అపోలో గా భావిస్తారు. శక్తికి, జీవానికి, కాలానికి ఆయన ప్రతీక. ఆయన అద్భుత సౌందర్యాన్ని కలిగిఉంటాడు.

బంగారు వన్నె కురులతో తేజోమయమైన కన్నులతో సూర్యుడు ఎంతో అందంగా ఉంటాడు. ఆయనను అందరూ ఇష్టపడతారు.

అయితే క్లైటీ అనే వనదేవత ఆయనను అమితంగా ప్రేమించేది. అయితే సూర్యుడు ఆమె ప్రేమను తిరస్కరించాడు. జల దేవుని కుమార్తె అయిన డఫ్నే ను సూర్యుడు ప్రేమించాడు. కానీ డఫ్నే సూర్యుని ప్రేమించలేదు. సూర్యుడు తనని ప్రేమించమని డఫ్నేను ఒత్తిడి చేయడం తో ఆమె తన తండ్రికి మొరపెట్టుకుంది. అప్పుడు ఆ జలదేవుడు ఆమెను ఒక మొక్కగా చేశాడు. సూర్యుని హృదయం గాయపడింది.

కానీ ఒకవైపు సూర్యుని అమితంగా ప్రేమించిన క్లైటీ వరుసగా తొమ్మిది రోజులు అన్నపానీయాలు మానేసి ఉన్నచోటే ఉండి సూర్యుడు ఒచ్చినప్పటినుండీ వెళ్ళేవరకూ అతన్నే చూస్తూ ఉండిపోయింది. క్రమంగా ఆమె ఒక పువ్వుగా మారింది. ఆ పువ్వే sunflower అని పిలిచే పొద్దుతిరుగుడు పువ్వు.

పొద్దు తిరుగుడు పువ్వు సూర్యునివైపే తిరగడానికి అసలైన కారణం :

పొద్దుతిరుగుడు పువ్వు సూర్యునివైపే తిరగడానికి అసలైన కారణం ఆ మొక్కలో ఉండే ఫోటో ట్రాపిజమ్ అనే చర్య. సూర్య రశ్మి వలన మొక్కలు పెరుగుతాయని మనందరికీ తెలుసు. అలాగే పెరుగుదలతో పాటు సూర్యరశ్మికి ప్రతిస్పందించడమే ఫోటోట్రాఫిజమ్. మొక్కలో ఉన్న అమైనో ఆమ్లాలు, కార్బోహైడ్రేటులు విచ్ఛిన్నం అయి ఆక్సిన్ అనే హార్మోన్ ఏర్పడుతుంది. ఇది మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది. పొద్దుతిరుగుడు కాండం లో ఉన్న ఆక్సిన్ హార్మోన్ వల్ల సూర్య రశ్మి వైపుకు పువ్వు తిరుగుతుంది.

ఆక్సిన్ హార్మోను సూర్యరశ్మి పడని భాగం లో ఎక్కువగా ఉత్పత్తి ఔతుంది. పువ్వు సూర్యుని వైపు తిరిగి ఉన్నప్పుడు, ఆ పువ్వు వెనుకభాగం లో ఉన్న నీడలో ఆక్సిన్ ఉత్పత్తి ఔతుంది. తద్వారా ఆభాగం వేగంగా పెరుగుతుంది. ఆ వేగమైన పెరుగుదల వల్ల పువ్వు కదులుతుంది. నీడ ఉన్నచోటికి పువ్వు వెనుక భాగం తిరిగే ప్రక్రియలో సూర్యుని వైపుకి పువ్వు ముందుభాగం కదులుతుంది. అందుకే పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని కి అభిముఖంగా తిరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here