యోగులూ సన్యాసులూ కాషాయం ఎందుకు ధరిస్తారు?

0
7669

77b2a8ac428dc334cabd03b670801cd2

కాషాయం రంగు  నేడు ఒక రాజకీయ గుర్తుగా మిగిలిపోయింది. కాషాయం కేవలం హిందూ మతాన్ని మాత్రమే సూచిస్తుందా? ఇన్ని వేల రంగులుండగా హిందూ మతానికి చెందిన యోగులు, సన్యాసులూ కాషాయాన్నే ఎందుకు ధరిస్తారు?

కాషాయం రంగు సూర్య తేజాన్ని ప్రతిబింబిస్తుంది. సూర్యుడు చైతన్యానికీ జ్ఞానానికీ ప్రతీక. నిద్రాణమై నిర్వీర్యంగా, నిస్సత్తువగా ఉన్న జాతిని మేల్కొల్పడానికి జ్ఞాన సూర్యులై వెలుగొందుతారు ఋషులు. సూర్యుని వెలుతురుకి పేద, ధనిక భేదాలుండవు. ఋషులు, యోగులు సన్యాసులలో కూడా అందరినీ సమానంగా చూసే గుణాన్ని కాషాయం సూచిస్తుంది.

కాషాయం అగ్నికి ప్రతీక. తమ అహాన్నీ, కామ క్రోధాది అరిషడ్వర్గాలనీ దహించివేసే అగ్ని కాషాయం. వారు అరిషడ్వర్గాలనూ, కుల, మత, పేద,ధనిక భేదాలనూ, అన్ని రకాల కట్టుబాట్లనూ జ్ఞానమనే దివ్యాగ్నిలో ఆహుతి చేసి సర్వసంగ పరిత్యాగులౌతారు. కనుకనే యోగులు సన్యాసులు కాషాయం రంగును ధరిస్తారు.

హిందూ మత వ్యతిరేకంగా ఉద్భవించిన బౌద్ధ జైన మతాలు కూడా కాషాయం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించి హిందూ మతాన్ని అనుసరించాయి.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here