శ్రీవారికి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు? దాని విశిష్టత ఏమిటి? | Why Green Green Camphor Applied to Sri Venkateshwara Swamy

0
1186
Why Green Green Camphor Applied to Sri Venkateshwara Swamy
Why Green Green Camphor Applied to Sri Venkateshwara Swamy?

Why does Lord Venkateshwara Swamy have Camphor on his Chin?

2శ్రీవారికి గడ్డం కింద పచ్చ కర్పూరంతో అలంకరించడానికి వెనక ఉన్న కథ ఏమిటి?! (What is the Story Behind Adorning Srivari’s Chin With Green Camphor?!)

శ్రీవారికి ఇష్టమైన భక్తుడు అనంతాళ్వారు. అనంతాళ్వారు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. అతను ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్వయంగా పూలమాలలు అల్లి సమర్పించేవాడు. ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూలతోట పెంపకానికి నీరు కోసం ఒక చెరువు కావాలి అని గ్రహించి త్రవ్వాలని నిర్ణయించుకొని మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకున్నారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు గర్భవతి. అతను మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. ఇది అంతా గమనించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాల బాలుని రూపంలో వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని, మట్టిని కూడ నేను మోస్తాను అని చేపుతాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు. కాని భార్య అంగీకరించడంతో స్వామి వారు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి బాలుడికి ఇస్తది.

భార్య మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించాడు. అప్పుడు బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. అనంతాళ్వారు కోపగించుకుంటారు. కోపంతో ఉన్న అనంతాళ్వారుల తన చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనబడకుండా మాయం అయిపోతాడు.

ఆలయంలో పూజారులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం గమనించి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తారు. అతడు ఆలయానికి చేరుకోని శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి భయపడతాడు. మాకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి ఇంకా బాధపడతారు. శ్రీవారి పాదాలపై పడి మన్నించమని కోరుకుంటాడు. గాయం వలన కలిగే బాధనుండి ఉపసమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెడతారు. అప్పటి నుండి శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరంతో అలంకరించడం అనవాయితాగా వస్తుంది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని చూడాలనుకుంటే దేవాలయంలోని కుడివైపు గోడకు ఇప్పటికి వేలాడుతూ ఉండడం చూడవచ్చు.

Related Posts

శివుడి అనుగ్రహం కొరకు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి | Worship To Lord Shiva in Shravana Month

19 ఏళ్ళ తర్వాత అరుదైన అధిక శ్రావణ మాసం! అస్సలు చేయకుడని పనులు ఇవే!? | Rare Adhika Sravana Masam 2023

రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu

పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు, ఇవి పాటించకపోతే ఇక మిమ్మల్ని ఎవరు కాపాడలేరు! | Rules for Lighting Lamp at Puja Time

శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant

అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023

తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ అక్టోబర్ నెలకు విడుదల | Tirumala Gadapa Darshanam Tickets For The Month of October 2023

ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples

ఆది పురుషుడు శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management Lessons

ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple

కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread

Next