శ్రీ కృష్ణుని తలపై నెమలిపింఛం ఎందుకు? | Why Krishna Wears Peacock Feather Story in Telugu

2
4911

 

krishna1
శ్రీ కృష్ణుని తలపై నెమలిపింఛం ఎందుకు? | Why Krishna Wears Peacock Feather Story in Telugu

2. నెమలి పింఛమే ఎందుకు?

ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆహ్లాదకరమైన వాతావరణంలో చిద్విలాసంగా మురళిని వాయించడం ప్రారంభించాడు. శ్రీ కృష్ణుని మురళీ గానానికి అక్కడి ప్రకృతి మొత్తం పులకరించిపోయింది. గోవర్ధన గిరి ప్రవశంమయింది. మురళీ లోలుని సమ్మోహన సంగీతానికి అక్కడ ఉన్న నెమలులన్నీ ఆయన చుట్టూ చేరాయి. తన్మయంగా వింటూ నిలిచిపోయాయి.

శ్రీ కృష్ణుడు మురళివాయిస్తూ నాట్యం చేయసాగాడు. ఆయన అడుగులు చూస్తూ నెమళ్లు నాట్యం నేర్చుకున్నాయి. ఆ దివ్య మురళీ గానం ముగిశాక  నెమళ్లన్నీ కలిసి స్వామికి నమస్కరించి, ‘స్వామీ మాకు నీవు అత్యద్భుతమైన నాట్యాన్ని నేర్పించావు. నీవు మాకు గురువువి. గురుదక్షిణగా మా నెమలి పింఛాలను స్వీకరించండి.’  అని ఆ కృష్ణపరమాత్ముని పాదాల ముందు తమ పింఛాలను సమర్పించాయి.

శ్రీకృష్ణుడు వాటి భక్తికి మెచ్చి ఆ నెమలి పింఛాలను తన తలపై ధరించాడు.

Promoted Content

2 COMMENTS

  1. very useful information and your website is giving pleasure for sharing such a useful and wonderful thoughts to us sir

    Once again thank u very much sir

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here