పరమ శివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరిస్తాడు ? Why Lord Shiva Wears Tiger Skin In Telugu

0
14997

why-lord-shiva-wears-tiger-skin

Secret behind Lord Shiva seen wearing Tiger Skin

Next

2. శివపురాణం లోని కథ

పరమ శివుడు సర్వసంగ పరిత్యాగి. స్వామి దిగంబరుడై అరణ్యాలలో శ్మశానాలలో తిరుగాడుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయన సంచరిస్తూ ఉండగా మునికాంతలు, (మునుల భార్యలు) పరమేశ్వరుని సౌందర్యానికీ, ఆయన తేజస్సుకీ కళ్ళు తిప్పుకోలేకపోయారు. వారిలో ఆయనను చూడాలన్న కాంక్ష పెరగసాగింది. ఆయననే తలుచుకుంటూ గృహకృత్యాలను కూడా సరిగా చేసేవారు కాదు. తమ భార్యలలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేమిటని వెతికిన మునులకు పరమేశ్వరుని చూడగానే సమాధానం దొరికింది.

వారు ఆ దిగంబరుడే సదాశివుడని మరచి ఆయనను సంహరించడానికి ఆలోచనచేశారు. ప్రతిరోజూ స్వామి నడిచే దారిలో ఒక గుంతను తవ్వారు. స్వామి ఆ గుంత సమీపానికి రాగానే అందులోనుంచీ వారి తపశ్శక్తితో ఒక పులిని సృష్టించి శివుని మీదికి ఉసిగొల్పారు. రుద్రుని ఎదుట నిలవగలిగిన పరాక్రమం ఈ ప్రపంచం లో ఉంటుందా? మహాదేవుడు అనాయాసంగా ఆ పులిని సంహరించాడు. మునుల చర్యవెనుక వారి ఉద్దేశ్యం అర్థం చేసుకుని ఆ పులితోలుని కప్పుకున్నాడు.

పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక, సంహారకారి, భయానకమైనది. అటువంటి పులి కూడా లయకారుడైన పరమేశుని ఎదుట నిలవలేదని, కాల స్వరూపుని ఎదుట నిలబడ గలది ఏదీ లేదని చెప్పడమే ఇందులోని  ఉద్దేశ్యం. స్వామి పులిచర్మం పై కూర్చున్నా, పులిచర్మాన్ని ధరించినా అందుకు కారణం ఆయన సర్వోత్కృష్టమైన కాల స్వరూపుడని చెప్పడమే.

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

Next

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here