మంత్రాలు సంస్కృతం లోనే ఎందుకు ఉంటాయి? | Why Mantras are in Telugu ?

0
9024
మంత్రాలు సంస్కృతం లోనే ఎందుకు ఉంటాయి? | Why Mantras are in Telugu ?
Why Mantras are in Telugu

Why Mantras are in Telugu

సంస్కృతం ప్రపంచంలోని భాషలన్నిటిలోకీ చాలా ప్రాచీనమైంది. ఇతర దేశాలలో ప్రజలు ఆటవిక జీవనం సాగించే సమయంలో భారత దేశం అప్పటికే అత్యంత ఆధునికమైన నాగరికతను, సాంకేతిక విజ్ఞానాన్నీ కలిగి ఉంది. వేదాలు అప్పటికే భారతదేశంలో ఆచరింపబడుతున్నాయి. ప్రపంచం అక్షరాలు కూడా ఏర్పరుచుకోకముందే మనకు సాహిత్యం ఉంది. వేదాలనే విజ్ఞాన భాండాగారం ఉంది. ఇది జగమెరిగిన సత్యం.

మరి వేదాలన్నీ సంస్కృతంలోనే ఎందుకున్నాయి.. ? ఇప్పుడు మనకు తెలిసిన సంస్కృతానికి వేదాలలోని సంస్కృతానికీ చాలా తేడా ఉంది. సంస్కృతాన్ని ఉచ్చరించడం వల్ల వెలువడే శబ్ద తరంగాలకు రోగాలను నయంచేసే శక్తి ఉంది.  మానసిక ప్రశాంతతను చేకూర్చే శక్తి ఉంది. ఇది మూఢనమ్మకం కాదు. ఎన్నో ప్రయోగాలలో సహేతుకంగా నిరూపించబడిన విషయం. సంస్కృత భాషకు జన్మస్థానమైన భారతదేశంలో ఆ భాషను మృతభాష అని తోసిపుచ్చుతుంటే, పాశ్చాత్యదేశాలు సంస్కృతం యొక్క గొప్పదనాన్ని గుర్తించి తమ విశ్వవిద్యాలయాలలో విద్యార్థులకు సంస్కృత భాషను నేర్పుతున్నారు. మంత్రోచ్చారణ సంస్కృతంలో జరగడానికి ప్రధాన కారణం ఆ అక్షరాలను ఉచ్చరించడం వల్ల పలికే వారికీ వినే వారికీ ఆరోగ్యపరంగా మానసికంగా కలిగే ఫలితాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here