మన దైనందిన జీవితములో మనకు ఏదన్నా సమస్య వచ్చినట్లైతే దాని యొక్క పరిష్కారము కొరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదాని అన్నీ వారి దగ్గరకు వెళ్ళి విన్న వించుకోము గదా! మనకున్న సమస్య ఏ శాఖకు సంభందించినదో అ శాఖాధిపతి దగ్గరకు వెళ్ళి విన్నవించుకోవడము ద్వారా సమస్య పరిష్కారము కోసము ప్రయత్నిస్తాము .
అలాగే మన జీవితములో మనకు ఎదురయ్యే ఒక్కో సమస్య పరిష్కారమునకు అమ్మవారిని ఒక్కో రూపములో ఆరాధించి, ఒక్కో నైవేద్యము సమర్పించి పూజించడము ద్వారా ఒక్కో గ్రహానికి సంభందించిన దోషము యొక్క తీవ్రత తగ్గి త్వరిత గతిన సత్ ఫలితములను పొందదానికి ఎంతో మేదస్సు దివ్యదృష్టి కల్గిన మన మహర్షులు, ఈ విధమైన సాంప్రదాయమును ఏనాడో ఏర్పరచడము జరిగింది. ఈ విధమైన నియమావళిని వారు ఏర్పరచడములో ఎన్నో జ్యోతిష, తాంత్రిక, మార్మిక శాస్త్రములను వారు పరిగణనలోకి తీసుకుని ఉంటారని మా పరిశోదనాత్మకమైన అనుభవానికి తోస్తుంది .
రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com