మనం చేసే కొన్ని పూజలు ఎందుకు ఫలించవు? | Why Some Worships Not Fruitful in Telugu

0
25884

maxresdefault (2)

2. పూజ అంటే ఏమిటి

పూజించడం , అర్చించడం భగవంతుని అనుగ్రహం కోసం చేసే ఉపచారాలు. మన ఋషులు వేల లక్షల సంవత్సరాలు శ్రమించి యోగాన్నీ, ధ్యానాన్నీ, తపస్సునీ తెలుసుకున్నారు.

వాటి సహాయం తో విశ్వాంతరాళం లోని ఎన్నో రహస్యాలను ఛేదించారు. ఏ శక్తిని ఎలా ప్రేరేపిస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుని, సామాన్య మానవులకు కూడా అందేలా పూజా విధానాన్ని ఏర్పరిచారు.

శక్తిని నిక్షిప్తం చేసుకోగల మహత్తరమైన గుణం ఉన్నది కనుక పూజలలో ప్రధానంగా నీటిని ఉపయోగిస్తారు.

మన ఎదుట ఉన్న ప్రతిమలలోకి భగవంతుని ఆవాహన చేసి, షోడశోప చారాలతో పూజించి, మంత్రాలద్వారా శక్తిని మేల్కొలుపుతారు.

చుట్టూ ఉన్న దుష్ట శక్తులను పారద్రోలి దైవికమైన శక్తిని ప్రసరింప జేస్తారు. ఆ దైవిక శక్తులే మనల్ని వెన్నంటి కాపాడి పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చి సకల శుభాలనూ కలుగ జేస్తాయి.

అంతే కాదు మంత్రాలు ఉచ్చరించడం, వినడం వల్ల శరీరం లో అనేక రుగ్మతలు తొలగుతాయి.

మానసిక వికాసం కలుగుతుంది. ఏకాగ్రత, జ్ఞానం పెరిగి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పూజా విధానం లో ఇంత శాస్త్రం ఉంది.

మొక్కు బడిగా పెట్టే నమస్కారాలూ, కొట్టే కొబ్బరికాయలూ పూజలు కావు. 

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here