శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ? | Siva Rudrabhishekam In Telugu

0
16665
14592515906_f80457a392_b
Siva Rudrabhishekam In Telugu

Siva Rudrabhishekam In Telugu

దీర్ఘవ్యాధులవారు తమ వ్యాధులు పోవాలనీ, మిగతావారు కోరికలతోనూ, భక్తితోనూ, శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు. (Siva Rudrabhishekam In Telugu) ఇలా చెయ్యటం వల్ల మరణ భయం పోతుందని పురాణ ఆధారము. రుద్రాభిషేకం చేయించేవారు ఓ ముఖ్య విషయం గుర్తుపెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి. రుద్రాభిషేకమును శివసంచారము తెలుసుకొని చేయించుకోవాలి. మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే లెక్కించుకొని రుద్రాభిషేకం చేయించుకోవాలి. శివపూజ చేసే తిథిని 10తో హెచ్చవేస్తే అనగా “0” చేర్చి 7తో భాగిస్తే “1” వస్తే కైలాసమున, “2” వస్తే పార్వతీదేవి వద్ద, “3” వస్తే వాహనుడై ఉన్నట్టు, “4” వస్తే కొలువు తీరినట్లు, “5” వస్తే నైవేద్యము స్వీకరిస్తున్నట్లు, “6” వస్తే ఆనంద నాట్యము చేస్తున్న సమయముగా, “7” వస్తే స్మశానమున ఉన్నట్టు తెలుసుకోవాలి. 7-14 తిథులలో పూజ తగదు. వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి.
శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం ప్రచురిస్తున్న శ్రీ కనకదుర్గ ప్రభ ఆధ్యాత్మిక సంచిక నుంచి సేకరించిన సమాచారం.

Siva Rudrabhishekam In Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here