
why should we light a lamp in karthika masama మనిషి యొక్క ఆయువు అనేది హృదయ స్పందన మీద ఆదారపడుతుంది . హృదయ స్పందన అనేది హృదయనాడి ద్వారా అనుసంధానం అయ్యి ఉంటుంది హృదయ నాడి మీకు భౌతికంగా కనపడేది కాదు. అది ఈశ్వర తేజస్సును పొంది ఉంటుంది. కార్తీక దీపం వలన హృదయ నాడి బలిష్ఠమవుతుంది ఎలా అంటే కార్తీక దీపం నువ్వుల నూనెతో వెలిగిస్తారు అని మనకు తెలుసు. నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు వత్తి నుంచి వచ్చే పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్ఠమవుతుంది. ఇలా జరుగుటము ఆయుఃకారకము. హృదయనాడి నిలబడుతుంది. అందుకని కార్తికమాసం ఉదయం దీపం, సాయంకాలం దీపం పెట్టించడానికి ఒక కారణం మరియొక కారణం దీపం ఎందుకు పెట్టిస్తారంటే సమస్త భూతకోటికి ఉపకారం చెయ్యమని. వాతావరణంలో ఆరోగ్యకరమైన వేడిని పెంచమని. బాహ్యమునందు ప్రతిపాదన చేయడానికి ఆవునేతితో కాని, నువ్వులనూనెతో పెట్టిన దీపమే పెట్టమని చెప్పటానికి వెనకవున్న తార్కికమైన కారణమది.
why should we light a lamp in karthika masama in Telugu.
మీ……పోస్టులు చాలా ఉపయోగపడేవిలా ఉంటాయి. …మీకు మా కృతజ్ఞతలు.
కొంతమంది నువ్వుల నుానెతో ఇంటిలొ దీపం పెట్టకుాడదంటారు…..
ఏ రకమైన నుానెతో దీపం వెలిగించడం శ్రేష్టము తెలియజేయగలరు. ….