
Why Sri Venkateswara Swamy Abhishekam on Friday?
1శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం శుక్రవారమే ఎందుకు చేస్తారు?!
తిరుమలలో వారంలో ఒక్క రోజు మాత్రమే స్వామి వారికి అభిషేకం చేస్తారు. స్వామి వారి అభిషేకం అనేది చాలా పెద్ద కార్యం. ఎందుకంటే స్వామి వారు ధరించన తిరు ఆభరణాలు అన్ని తీసివేయాలి, పచ్చకర్పూరం నామం కూడా తీసేయాలి. తర్వాత స్వామి వారికి పూనుకు తైలం ఒళ్ళు అంత పూస్తారు. తర్వాత మాత్రమే స్వామి వారికి అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తి అయిన తర్వాత స్వామి వారికి తిరిగి అలంకారం చేయాలి. ఇలా రోజు చేయాలి అంటే చాలా సమయం పడుతుంది కాబట్టి కేవలం శుక్రవారం మాత్రమే చేస్తారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు. స్వామి వారి వక్షస్థలంలో వ్యూహ లక్ష్మి ప్రత్యేక స్థానంలో (వక్ష స్థలం) ఉంటారు. అందుకే శ్రీనివాసుడు అనే పేరు వచ్చింది. అందుకే అమ్మవారి విగ్రహం ఎక్కడ ప్రత్యేకంగా లేదు. స్వామి వారిది ఏక బింబం. అందుకే స్వామివారికి శుక్రవారం చేస్తే లక్ష్మీ ప్రదంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున చేస్తారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.