Ganesh Chaturthi 2023
Why to Celebrate Ganesh Chaturthi (Telugu) వినాయక చవితి జరుపుకోవడములోని పరమార్ధం తెలుసా ?
జ్యోతిష్య కోణం లో పరిశోదాత్మకమైన వ్యాసం ……..
మన దైనందిన జీవన గమనం లో మనం అనేక సమయాలలో రకరకాలైన పనుల విషయంలో విఘ్నాలను అధిగమించలేక సతమతమవుతు ఉంటాము. వీటన్నింటికి కారణమేమిటో మీకు తెలుసా …. !!! ??
మానవ జీవితంలో సమస్త విఘ్నాలకు కారకుడు కేతువు అయితే ఆవిఘ్నాలకు లేదా విఘ్నముల నుండి కాపాడు వాడే విగ్నేశ్వరుడు. ఎవరి కేతువు ?ఎందుకు విఘ్నాలను కల్పిస్తూ భాధలకు గురి చేస్తాడు. అని ఆలోసించినట్లయితే మనం అతి ఉత్ర్కుష్టమైన , అత్యంత రహస్యమైన కర్మ జ్ఞానం గురించి కొంత పైపైన మనకు అవసరమైనంత వరకు చెప్పుకుందాము .
జీవులందరూ కూడా గత జన్మ కర్మ ఫలితాన్ని అనుభవించి ముక్తి ని పొందటానికి మాత్రమే పుడుతూ ఉంటారు. అయితే ఈ జ్ఞానము తల్లి గర్భంలో ఉన్నప్పుడూ ఉన్నప్పటికి …., మాయ పూరితమైన భాహ్య ప్రపంచంలోకి రాగానే అవన్నీ మర్చిపోయి ఇహలోక సంభంధమైన వాసనలకు లోనూ అయ్యి వాటి వెంట పరుగులిడుతూ ఉంటారు . అటువంటి సమయములలో ముక్తి కారకుడు అయిన ఈ కేతు భగవానుడు ఆయా సమయములలో జీవులను లౌకిక మాయలో పడి కొట్టుకు పోయి మరలా మరలా జన్మలకు కారణం కాకుండా ఆయా సమయాలలో ఆయా అంశాల విషయంలో అనగా ….
విధ్య లో అటంకాలు ,
వృత్తి అభివృద్ది విషయంలో ఆటంకాలు,
వివాహ విషయంలో ఆలస్యం / గొడవలు / విడాకులు,
సంతానం ఆలస్యం /అబార్షన్స్ ,
ఋణ సమస్యలు ,
వివాదాలు ,
యాక్సిడెంట్స్ ……..,
అంతు తెలియని వ్యాధులు వంటి వాటిని కలుగ చేస్తూ భాధలకు గురి చేయడము ద్వారా మనలను ముక్తి మార్గం వైపు అనగా ఆధ్యాత్మికత వైపు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు .ఎందుకంటే మనిషి సాదరణం గా సమస్యలు వచ్చినప్పుడు ఒకటి వైరాగ్యం వైపు వెళతాడు ,లేదా రెండు అసలు ఇలా ఎందుకు జరుగుతుందా అని ఆలోసించడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు .లేదా మూడు మరికొంత ఎక్కువగా పరిశ్రమ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆయా సమస్యల నుండి బయట ప్రయత్నం చేస్తాడు. ఈ విదంగా మరి కొంత పరిశ్రమ చేయడం ,జ్ణానము ను పెంచుకోవడం ,దైవానికి దగ్గరవడం ఈ మూడు కూడా కర్మ ముక్తి కి దారి తీసేవే కదా.
ఈ విధమైన కారణముల వలన మనిషి తీవ్రమైన శారీరక ,మానసిక సంఘర్షణలకు లోనూ అయినప్పుడు ఆయా సమయాలలో వాటి నుండి విముక్తికి లేదా వారి వారి గత జన్మ కర్మను అనుసరించి కొంతమేర అన్నా ఉపశమనం పొందుటకు వీలుగా మన మహర్షులు వేదాలు ,పురాణాల ద్వారా అనేక పరిహార మార్గములను చూచించడం జరిగింది . అందులోఒకటి “ గణేశ ఆరాధన “ . ఈ గణేశ ఆరాధన ను దాదాపుగా అందరు ఒకే విధంగా అనుసరిస్తున్నప్పటికి ఒక్కో సమస్యను ఎదుర్కొనే వారు ఒక్కో రకంగా ఆరాధించి పూజించడము ద్వారా ఆయా సమస్యలనుండి ఖచ్చితంగా విముక్తి /ఉపశమనం పొందవచ్చు .
తర్వాత పోస్టు లో ఏ సమస్యకు ఎటువంటి పూజా విధానం ద్వారా పరిహారం పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం ….
రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ పరిశోధకులు
ఒంగోలు
సెల్ : 9246461774
Vinayaka Chaviti Festival Related Posts
గణపతి ఆరాధన ఎలా చేయాలి? | How to Worship lord Ganesh in Telugu?
వినాయకుని పూజ ఏ విధంగా చేస్తే ఎటువంటి దోషం పోతుంది? | Ganesh Pooja for Dosha Nivarana in Telugu
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu
శివుడు నరికిన వినాయకుడి నిజమైన మనిషి తల ఎక్కడ ఉందో తెలుసా!? | Where is Ganesha’s Severed Human Head?